చిన్న సంస్థల కడుపుకొడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఎర్రన్నాయుడు హెచ్చరించారు.
ముఖ్యమంత్రి ఉనికి కోసమే ఇందిరమ్మబాటకేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు
శ్రీకాకుళం, జూలై 23 : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తన ఉనికిని కాపాడుకునేందుకే ‘ఇందిరమ్మబాట’ పేరుతో వస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కింజరాపు ఎర్రన్నాయుడు విమర్శించారు. శ్రీకాకుళం పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎర్రన్నాయుడు మాట్లాడారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి, పరిష్కారానికి రచ్చబండ, రాజీవ్ పల్లెబాటలు సరిపోలేదా అని ఎద్దేవా చేశారు. పాత సమస్యలే ఇంతవరకు పరిష్కారం చేయకుండా కొత్త సమస్యల కోసం రావడం హాస్యాస్పదమన్నారు. ప్రభుత్వ వైఖరి కారణంగా రాష్ట్రంలో 1.86 లక్షల పరిశ్రమలు మూలనపడ్డాయని, నిరుద్యోగ స్థాయి పెచ్చుమీరిపోతుందన్నారు. బహుళజాతి సంస్థలకు సాయం అందిస్తూ చిన్న సంస్థల కడుపుకొడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఎర్రన్నాయుడు హెచ్చరించారు.