చిరుత పులి చర్మం కేసులో ఆరుగురు నిందితుల అరెస్ట్
బైకు మూడు సెల్ ఫోన్లు మూడు వేల రూపాయలు స్వాధీనం
వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి
భూపాలపల్లి బ్యూరో అక్టోబర్ 21 (జనంసాక్షి): చత్తీస్గడ్ నుండి తెలంగాణ మీదుగా మహారాష్ట్రలోకి చిరుత పులి చర్మాన్ని రవాణా చేస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి చిరుత పులి చర్మాన్ని స్వాధీనపరచుకున్నారు. చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని పామేరు అటవీ ప్రాంతంలో ఒక చిరుత పులిని చంపి, దాని చర్మం ఒలిచి మహారాష్ట్రకు చిరుత పులి చర్మంను ఎవరికైనా అమ్మడం కోసం తెలిసిన వారిని కలవడానికి మహాదేవపూర్ ప్రాంతంకి వస్తూన్నారనే నమ్మదగిన సమాచారంపై మహాదేవపూర్ పోలీస్ స్టేషన్ పరిధి లో పోలీసులు వారిని పట్టుకొని వారివద్ద గల బ్యాగ్ ని పరిశీలించి చూడగా పోయిన చరిత్ర పులి చర్మం లభించినట్లు జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి తెలిపారు. నిందితులు ఇరుప నాగేంద్ర బాబు@చంటి, 28 సంవత్సరాలు, కోయ, వ్యవసాయం,సుందరయ్య కాలనీ కొయ్యూరు గ్రామం చర్ల మండలం, కొత్తగూడెం జిల్లా
పొలం వెంకటేష్ నాయకపోడ్,
రొయ్యూరు గ్రామం, ఏటూర్ నగరం మండలం, ములుగు జిల్లాపరిసబోయిన రాజేష్, ,శంకర రాజు పల్లి, మండలం ఏటూరు నాగారం, ములుగు జిల్లాఎర్ర గట్ల శ్రీకాంత్,ఏడుజెర్ల గ్రామం, వాజేడు మండలం, ములుగుజిల్లా బుర్రిసాయికిరణ్,దాచారం గ్రామం, కుక్కునూరు మండలం, వెస్ట్ గోదావరి జిల్లా, ప్రస్తుతం సారపాక గ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,బొమ్మకం,బెస్త గూడెం,కుక్కునూరు మండలం, వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన వారమని తెలిపినారు వారివద్ద నుండి చిరుత పులి చర్మం స్వాదీనం చేసుకొని వారిని మహాదేవపూర్ పోలీస్ అధికారులు విచారించగా వారు నేరం చేసిన విధానం మరియు వివరాలు తెలపడం జరిగింది.గత కొద్ది రోజుల నుండి ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా హుసూరు తాలూకా పామేడ్ గ్రామ శివారులో గల అడవిలో చిరుతపులి తిరుగుచున్నదని ప్రజలందరూ అనుకుంటుండగా అది గమనించి ఇద్దరు నేరస్థులు అట్టి చిరుత పులిని ఎలాగైనా చంపి దాని యొక్క చర్మము తీసి వన్యప్రాణుల చర్మం కొనే వారికి అమ్మినట్లయితే పెద్ద మొత్తంలో సులువుగా డబ్బులు సంపాదించవచ్చు అని పథకం వేసుకున్నారు.నేరంచేసిన విధానం మరియు మహాదేవపూర్ పోలీస్ వారి దర్యాప్తు నిందింతులు గత కోద్ది రోజులనుండి వ్యయసాయం, కూలి పనులు చేసుకుంటూ మరియు అడవి జంతువులను చంపి వాటిని ఇతరులకు అమ్ముకొని సులువుగా డబ్బులు సంపాదిస్తూ జీవిస్తున్నారు. గత కొద్ది రోజులనుండి చత్తీస్గడ్ రాష్ట్రం, పామేడ్ శివారు అడవిలో చిరుత పులి తిరుగుచున్నది మనము ఇద్దరం కలిసి ఎలాగైనా అట్టి చిరుత పులిని చంపి దాని యొక్క చర్మము తీసి ఇతరులకు ఎవరికైన అమ్మినట్లయితే పెద్ద మొత్తంలో సులువుగా డబ్బులు సంపాదించవచ్చు అని అనుకొని నింధితులు ఇద్దరు నాగేంద్రబాబు, పోలం వెంకటేష్ లు కొద్ది రోజుల నుండి అట్టి పులి గురించి రాత్రి వేళలలో టార్చి లైట్లను పట్టుకోని, పామేరు శివారులో గల అడవిలో తిరుగుతూ అక్కడ చిరుత పులి తిరిగే ప్రదేశానికి వెళ్లి, చిరుతపులి తిరిగే ఆనవాలును గుర్తించినారు. అట్టి చిరుత పులిని వారు ఎలాగైనా చంపి దాని యొక్క చర్మము తీసి అమ్మాలని నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకున్న ప్రకారముగా అట్టి పులిని ఉచ్ఛు పెట్టి చంపి వాటి యొక్క చర్మము తీసుకుని అమ్ముట గురించి మహారాష్ట్ర కు బయలుదేరినారు. అక్క సమాచారంతో పోలీసులకు చిక్కడంతో కటకటాల పాలయ్యారు