చిరుదాన్యాల తో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ పై మహిళలకు శిక్షణ కార్యక్రమం c
నేరేడుచర్ల (జనంసాక్షి )న్యూస్.చిరుదాన్యాలతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ పై మహిళలకు శిక్షణ కార్యక్రమాన్ని కృషి విజ్ఞాన కేంద్రం,గడ్డి పల్లి గృహ విజ్ఞాన శాస్త్రవేత్త ఎన్. సుగంధి పెంచికలదిన్న గ్రామములో బిక్కసాని కృష్ణకుమారి ట్రస్ట్ భవన్ లో శిక్షణను నిర్వహించారు .ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి వాణీ శ్రీరామ్మూర్తి పాల్గొని మహిళలు, నిరుద్యోగ యువతులను ఉద్దేశించి మాట్లాడుతూ చిరుదాన్యాలతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ ద్వారా మంచి పోషక ఆహారం తో పాటుగా స్వయం ఉపాధిని కూడా పొందవచ్చని అన్నారు.ఈ శిక్షణ లో ఎన్. సుగంది గృహ విజ్ఞాన శాస్త్రవేత్త చిరుదాన్యాల యొక్క ప్రాధాన్యత ను వివరించారు మరియు వీటికి కావలసిన నైపుణ్యత అంశాల గురించి యువతులతో ఎలా చేయాలో ప్రాక్టికల్ గా వివరించారు.మహిళలు గ్రూప్ గా ఏర్పడి వివిధ చిరు ధాన్యాలతో వివిధ వంటకాలను తయారు చేసుకొని మార్కెటింగ్ చేసు కోవడం ద్వారా ఆర్థికంగా లబ్ధి పొందవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమములో 12 మంది సమభావవ సంఘం సభ్యులు పాల్గొన్నారు.