*చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం.
చిట్యాల19( జనంసాక్షి) చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని అంగన్వాడి సూపర్వైజర్ జయప్రద అన్నారు. సోమవారం పోషణ మాసంలో భాగంగా ముచినిపర్తి గ్రామ పంచాయతీలో అంగన్వాడీ టీచర్ పుష్ప ఏర్పాటు చేసిన సమావేశానికి గ్రామ సర్పంచ్ నందికొండ కవిత అధ్యక్షత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సూపర్వైజర్ జయప్రద హాజరై మాట్లాడారు. మహిళలలో, కిషోర్ బాలికలలో, పిల్లలలో పోషకాహార లోపాన్ని రక్తహీనతను తగ్గించుటకు తీసుకోవలసిన ఆహారం, ఆరోగ్యం, వ్యక్తిగత శుభ్రత పరిసరాల పరిశుభ్రత త్రాగే మంచి నీరు ప్రాముఖ్యతల గూర్చి వివరించారు. పల్లె ప్రాంతాలలో దొరికే ఆకుకూరలు, కూరగాయలు పండ్లు పాలు చిరుధాన్యాలను మొలకెత్తించిన గింజలను ప్రతిరోజు సమపాళ్లలో తీసుకున్నప్పుడు పోషకాహార లోపాన్ని తగ్గించి ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని తెలిపారు. అనంతరం నలుగురిగర్భిణీలకు శ్రీమంతం నిర్వహించి, ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమములో గ్రామ కార్యదర్శి మహేష్, అంగన్వాడీ టీచర్స్ తిరుపతమ్మ, త్రివేణి ,కవిత, కనక లక్ష్మి, లావణ్య, హెల్త్ సిబ్బంది హెల్త్ సిబ్బంది మరియు మహిళలు పాల్గొన్నారు.