చీకొడులో ప్రభుత్వ దవాఖాన మంత్రి ఆదేశాలతో కదిలిన వైద్య శాఖ.
– ఎంపిటిసి రాంరెడ్డి విజ్ఞప్తికి మంత్రి సానుకూల స్పందన.
– చీకోడు పరిసర ప్రాంత ప్రజలకు తీరనున్న వైద్య కష్టాలు.
– సబ్ సెంటర్ మారనున్న పల్లె దవాఖాన.
దుబ్బాక ఆగష్టు 29,( జనం సాక్షి )
దుబ్బాక మండలం చీకోడు పరిసర ప్రాంత ప్రజల కష్టాలు త్వరలో తీరనున్నాయి. చీకొడ్ ఎంపిటిసి లచ్చమ్మగారి రాంరెడ్డి పలుమార్లు మంత్రి తన్నీరు హరీష్ రావుకు చేసిన విజ్ఞప్తి మేరకు హెల్త్ వెల్ నెస్ సెంటర్ పల్లె దవాఖాన ఏర్పాటుకు సంంధించిన విధివిధానాలను తయారు చేయాలని డిఎం అండ్ హెచ్ వో కాశీనాథుకు ఆదేశించారు. డీ ఎమ్ అండ్ హెచ్ వో ఆదేశాల మేరకు సోమవారం రామక్కపెట్ మెడికల్ ఆఫసర్ కార్తిక్ సబ్ సెంటర్ ను సందర్శించారు. పల్లె దవాఖాన చీకోడు లో ఏర్పాటు ఐతే గ్రామ పరిసర ప్రాంతాలైన కమ్మర్ పల్లి, అచ్చుమాయపల్లి, పర్శరాంనగర్, ఆరేపల్లి, పోతారం, గంబీర్ పూర్, శిలాజి నగర్, టేకుల తాండా, గోసాన్ పల్లి, రఘోతంపల్లితో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభిరావు పెట్ మండలం కోలమద్ది, కొత్తపల్లి, శ్రిగాధ, రాజుపేట గ్రామాల ప్రజలకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. పల్లె దావాఖానలో మెడికల్ ఆఫసర్ తో పాటు స్టాప్ నర్స్, ఇద్దరు ఎన్ ఎమ్ లు, ఆశా వర్కర్లు విధులను నిర్వర్తించడం జరుగుతుంది. సీజనల్ వ్యాధిగ్ర్తులకు, బిపి, షుగర్ పేషెంట్లకు ఉపయోగరంగా ఉంటుంది. ఒపి సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తే మాత్రం ఇక్కడి ప్రాంత ప్రజలకు దురభారం తగ్గడమే కాకుండా వ్యయ భారం తగ్గుతుంది. చీకొడు వ్యాపారపరంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఇప్పటికే గ్రామంలో ఎస్ బీ ఐ బ్యాంక్, విద్యుత్ సబ్ స్టేషన్ కుతోడు పల్లె దవాఖాన రావడంతో చీకోడ్ మరింత అభవృద్ధి చెందడానికి అవకాశం లేకపోలేదు. పల్లె దవాఖాన ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చిన మంత్రికి రాం రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.