చెక్కులతో బ్యాంకుల వద్దకు పరుగు
ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు
ఆదిలాబాద్,మే12(జనం సాక్షి ): రాష్ట్ర ప్రభుత్వం అందించిన పెట్టుబడి సాయం కోసం రైతన్నలు బ్యాంకుల వద్దకు పరుగులు పెడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చెక్కులు అందుకున్నదే తడవుగా తమకు కేటాయించిన బ్యాంకుల వద్దకు పరుగెడుతున్నారు. దీంతో బ్యాంకుల వద్ద రద్దీ నెలకొంది. గ్రామాల్లో చెక్కుల పంపిణీ కార్యక్రమం మూడు రోజలుఉలగా ప్రారంభమైంది. చెక్కులతో రైతులు వెంటనే వారికి కేటాయించిన బ్యాంకుల వద్దకు వరుస కట్టారు. బ్యాంకుల వద్దకు భారీగా రైతులు రావడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. తగిన సిబ్బంది లేక బ్యాంకరల్లు సకాలంలో వారికి నగదు అందించలేకపోతున్నారు. కొన్ని బ్యాంకుల వద్ద తాగునీటి సౌకర్యం లేకపోవడంతో రైతులు నీళ్ల కోసం తాపత్రయపడ్డారు. మరికొన్ని చోట్ల షామియానాలు సరిపోకపోవడంతో సవిూపంలోని చెట్ల నీడకు వెళ్లి ఎండ నుంచి రక్షణ పొందారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వరుసలో నగదు కోసం నిరీక్షించారు. ఇదిలా ఉండగా నగదు తీసుకున్న రైతుల ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. వీరంతా ఆనందగా నగదు తసీఉకుని ఇంటివద్దకు చేరుకుంటున్నారు. మరోవైపు చోరీలు జరక్కుండా పోలీసులు బ్యాంకుల వద్ద గస్తీ ఏర్పాటు చేశారు.