చెట్లుంటేనే క్షేమం
బోథ్ జులై 04(జనంసాక్షి) చెట్లుంటేనే క్షేమమని సర్పంచ్ పంద్రం సుగుణ అన్నారు. బుధవారం పట్నాపూర్ గ్రామపంచాయతిలోని రైతువేదికలో గ్రామ సర్పంచ్ పంద్రం సుగుణ సిబ్బంది తో కలిసి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఉపాధిహామీ ఏపిఒ జగ్గేరావు ఎంపిఓ జీవన్ రెడ్డిలు హాజరై గ్రామ ప్రజలు తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో అందరు భాగస్వామ్యం కావాలని నాటిన ప్రతి మొక్క పెరిగేలా చూడాలని మహిళా సంఘాల సభ్యులు నర్సరీ లోని పూలమొక్కలు తీసుకోని ప్రతి ఇంట్లో పెరట్లో నాటి వాటిని సంరక్షణ చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి సభ్యులు అప్క రాజేశ్వర్ వ్యవసాయ విస్తరణ అధికారి శ్యామ్ సెక్రటరీ మితున్ ఏఎన్ఎం కవిత అంగన్వాడీ ఆశ పటేల్ ఆడేం పొల్లు ఆత్రం దేవరావు మాజీ ఎంపిటిసి అప్క శంకర్ తొడషం గోపాల్ ఐకేపి సిఏ శ్రీనివాస్ మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు