చెట్ల నర్సంపల్లి లో సి సి రోడ్ పనులకు శంకుస్థాపన :జడ్పీటీసీ రణం జ్యోతి.
దౌల్తాబాద్ అక్టోబర్ 18, జనం సాక్షి.
దౌల్తాబాద్ మండలపరిధిలో చెట్ల నర్సంపల్లి గ్రామంలో 5లక్షల తో నిర్మించనున్న సి సి రోడ్ పనులకు జడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటినుంచి ఎనిమిది సంవత్సరాలుగా ఎన్నో అభివృధ్ది కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు.
గ్రామంలో గ్రామపంచాయతీ భవనం, వాటర్ ట్యాంక్,సి సి రోడ్డు లు ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాలు పట్టణాలుగా దిన దినంగా అభివృద్ధి చెందడం అభినందనియమని అన్నారు.ఈ కార్యక్రమం లో సర్పంచ్ జనార్దన్,దౌల్తాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్ష్మీ, వైస్ ఎంపీపీ శేఖర్ రెడ్డి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వేమ శ్రీనివాస్,మండల పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్ , ఎంపీటీసీ లక్ష్మీ నర్సమ్మ,వార్డు సభ్యులు,కో ఆప్షన్ సభ్యులు,పంచాయతీ, కార్యదర్శి, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.