చెన్నై చెత్త రికార్డ్
60 పరుగుల తేడాతో ఘన విజయం
ఐపీఎల్ 6లో అత్యల్ప స్కోర్ చెన్నైదే
ముంబై మే 5(జనంసాక్షి) : ముంబై ఇండియన్స్ చేతిలో చెన్నై సూపర్‌కింగ్స్ దారుణమైన ఓటమిని చవిచూసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఓడిపోయిన దానికన్నా ఎక్కువ చెత్తగా ధోనీ సేన ఓడిపోయి నిలకడైన జట్టు అనే నమ్మకాన్ని వమ్ము చేసింది. ఈ ఐపియల్ సీజన్‌లో అత్యంత స్వల్ప స్కోరు చేసిన ఘనత చెన్నై సూపర్‌కింగ్స్ మూటగట్టుకుంది. ఇప్పటి వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఢిల్లీడేర్ డెవిల్స్ నమోదు చెసిన 80పరుగులు అత్యల్ప స్కోరు కాగా, ఆ రికార్డును బద్దలు కొడుతూ ముంబై ఇండియన్స్ కేవలం 79 పరుగులు మాత్రమే చేసి చేతులెత్తేసింది. ముంబై ఇండియన్స్‌పై చెన్నై 60పరుగుల భారీ తేడాతో తోక ముడిచింది. తొలుత బ్యాటింగ్ చెసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 139 పరుగుల చేసింది. 140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్‌కింగ్స్ పెవిలియణ్ బాట పట్టడంతో సూపర్ అనిపించుకుంది. 15.2 ఓవర్లలో 79పరుగులకు మాత్రమే అలౌటయింది. ఓపెనర్ హస్సీ(22), రవీంద్రజడేజ(20), ధోని(10) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. మరళీ విజయ్(2), రైనా(0), బ్రావో(9), అశ్విన్(2), మోరిస్(1), మోహిత్‌శర్మ(0), లాగ్లిక్(4) ఘోరంగా విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో జాన్సన్, ఓజా మూడేసి వికెట్లు తీసుకున్నారు. మలింగ రెండు వికెట్లు తీసుకోగా, హర్బజన్ సింగ్, సుయాల్ తలో వికెట్ తీసుకున్నారు. ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్‌లో రోహిత్‌శర్మ (30బంతుల్లో 39పరుగులు) చేసి టాస్‌స్కోరర్‌గా నిలిచాడు. ఇంతకు ముందు చెన్నై అత్యల్ప స్కోర్ 109పరుగులు.చ 2009లో రాజస్థాన్‌పై జైపూర్‌లో ఈ స్కోరు నమోదు చేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కిరోన్‌పోలార్డ్ హస్సీ క్యాచ్‌ను వదిలేయకపోయి ఉంటే చెన్నై పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. మిచెల్ జాన్సన్ తొలి ఓవర్లో మూడు వరుస బంతుల్లో మూడు సార్లు పోలార్డ క్యాచ్‌ను వదిలేశాడు. పోలార్డ సురేశ్ రైనా, ధోనిల క్యాచ్‌లను పట్టాడు. రవీంద్ర జడేజా ఇచ్చిన క్యాచ్‌ను వదిలేశాడు. అయితే దాన్ని అందుకోవడం చాలా కష్టమైన పనే. ముంబైపై ఓడిపోయినప్పటికీ పాయింట్ల పట్టికలో చెన్నై అగ్రస్థానంలో నిలిచింది. చెన్నై ఇప్పటి వరకు 12 మ్యాచ్‌ల ఆడి మూడింటిలో ఓడిపోయింది. ఆదివారం నాటి విజయంతో ముంబై మూడో స్థానానికి ఎగబాకింది.