చెరువులు చెరబడితే చరసాల తప్పదు

` కబ్జా దారులకు సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరిక
` ఆక్రమణలను వదిలి గౌరవంగా తప్పుకోవాలని సూచన
` కూల్చివేతలపై స్టే తెచ్చుకున్నా కోర్టుల్లో కొట్లాడుతాం
` త్వరలో మరో 35వేల ఉద్యోగాల భర్తీ
` పటిష్టంగా తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌
` ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో పాటు..అవినీతి భరతం పట్టాల్సిందే
` నేరస్థులకు పోలీసులంటే వణుకు పుట్టాలి
` మూసీ ఆక్రమణలు సమూలంగా తొలగిస్తాం
` పేదలకు మరోచోట డబుల్‌ ఇళ్లు ఇస్తాం
` చెరువుల ఆక్రమణదారులను జైలుకు పంపిస్తాం
` హైడ్రాపై విమర్శలను సహించేది లేదు
` ఎస్సైల పాసింగ్‌ అవుడ్‌ పరేడ్‌లో ముఖ్యమంత్రి ఉద్ఘాటన
` వరద బాధితులకు తెలంగాణ పోలీసుల రూ.11కోట్ల విరాళం
హైదరాబాద్‌(జనంసాక్షి):కొందరు పెద్దలు ప్రాజెక్టుల వద్ద ఫాంహౌస్‌లు కట్టుకున్నారని, ఫాంహౌస్‌ల నుంచి వచ్చే డ్రైనేజీని గండిపేటలో కలుపుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. ఆక్రమణలను వదిలి గౌరవంగా తప్పుకోవాలని సూచించారు. ఆక్రమణలను కూల్చే బాధ్యత తాను తీసుకుంటానని, కూల్చివేతలపై స్టే తెచ్చుకున్నా కోర్టుల్లో కొట్లాడుతామని స్పష్టం చేశారు.కొందరు పెద్దలు ప్రాజెక్టుల వద్ద ఫాంహౌస్‌లు కట్టుకున్నారని, ఫాంహౌస్‌ల నుంచి వచ్చే డ్రైనేజీని గండిపేటలో కలుపుతున్నారని సీఎం రేవంత్‌? ఆరోపించారు. గండిపేట జలాలు నగర ప్రజల తాగునీటికి వాడుతున్నామని చెప్పారు. నాలాల ఆక్రమణలతో ఉప్పెనలా వరదలు వస్తున్నాయని, వరదలు వస్తే పేదల ఇళ్లు మునుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులను ఆక్రమణల నుంచి విడిపించేందుకే హైడ్రా ఏర్పాటు చేశామని, ఆక్రమణలను వదిలి గౌరవంగా తప్పుకోండని సూచించారు. ఆక్రమణలను కూల్చే బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేశారు.కూల్చివేతలపై స్టే తెచ్చుకున్నా కోర్టుల్లో కొట్లాడుతామని రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ కాలుష్యం నల్గొండకు చేరుతోందని, ఆ కాలుష్యాన్ని నియంత్రించాలని తెలిపారు. ఆక్రమణలు తొలగించి మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి చేస్తామని, మూసీ పరివాహక ప్రాంతంలో పేదల ఆక్రమణలు ఉన్నాయని చెప్పారు. పేదల పట్ల ప్రభుత్వం మానవతా ధోరణితో వ్యవహరిస్తుందని, 11 వేల మంది బాధితులకు 2 పడక గదుల ఇళ్లు ఇస్తామని ప్రకటించారు.తెలంగాణ పోలీస్‌ అకాడవిూలో ఇవాళ సబ్‌ ఇన్‌స్పెక్టర్ల మూడో బ్యాచ్‌ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అకాడవిూలో శిక్షణలో మెరుగైన ప్రదర్శన చేసిన వారికి సీఎం మెడల్స్‌ అందించారు. పోలీస్‌ స్కూల్‌ ఏర్పాటుకు 50 ఎకరాలు కేటాయిస్తామని, రాబోయే రెండేళ్లలో పోలీస్‌ స్కూల్‌ ఏర్పాటు చేస్తామని వెల్లడిరచారు. పోలీసు సిబ్బంది పిల్లలు ఒకేచోట చదువుకోవాలని సూచించారు. అంతకముందు పోలీస్‌ విభాగం తరఫున 11 కోట్ల 6 లక్షల 83 వేల 571 రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా డీజీపీ జితేందర్‌, శివధర్‌ రెడ్డి తదితరులు రేవంత్‌?రెడ్డికి చెక్‌?ను అందజేశారు. కాగా ప్రభుత్వ ఉద్యోగాలపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది పూర్తి అయ్యేలోపు మరో 35 వేల ఉద్యోగాలు ఇవ్వాలని ప్రజాపాలన ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రకటించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయిన రెండు నెలల్లోనే 30వేల పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేశామని గుర్తుచేశారు. బుధవారం తెలంగాణ అకాడవిూలో ఎస్సైల పాసింగ్‌ అవుడ్‌ పరేడ్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ… శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్‌ఐలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.. ఈ సన్నివేశం విూతో పాటు నాకు కూడా మధుర జ్ఞాపకం అని అన్నారు.
హైడ్రా పనితీరు భవిష్యత్‌ కార్యచరణపై ముఖ్యమంత్రి సంచలన కామెంట్స్‌ చేశారు. ఆక్రమణదారులను అవసరమైతే జైలుకు పంపించేందుకు కూడా వెనుకాడబోమన్నారు. ముందుగానే మేల్కొంటే మాత్రం మంచిదని సూచించారు. హైదరాబాద్‌లో జరిగిన పోలీస్‌ అకాడవిూలో పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్‌ రెడ్డి హైడ్రాపై కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణల వల్లే వరదలు వస్తున్నాయని తెలిపారు. వరదలతో పేదల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయని అందుకే ప్రక్షాళన చేపట్టినట్టు తెలిపారు. చెరబట్టిన వారి నుంచి హైడ్రాతో చెరువులను విడిపిస్తున్నామన్నారు. అవసరమైతే ఆక్రమణదారులను జైలుకు పంపేందుకూ వెనకాడబోమన్నారు. ఆక్రమించుకున్న చెరువులను స్వచ్ఛందంగా వదులుకోవాలని ఆక్రమణదారులకు ఆఫర్‌ ఇచ్చారు. లేకపోతే చెరువులలోని అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసి తీరుతామని హెచ్చరించారు. నాలాల ఆక్రమణలను నిరభ్యంతరంగా కూల్చేస్తామన్న రేవంత్‌… ఆక్రమణలు తొలగించి మూసీని ప్రక్షాళన చేస్తామన్నారు. మూసీ నాలాల్లో ఉన్న శాశ్వత నివాసదారులకు డబుల్‌ బెడ్రూం ఇండ్లు అందిస్తామని హావిూ ఇచ్చారు. నివాసితులైన 11వేల మందిలో ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని భరోసా కల్పించారు. ఎప్టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిలో నిర్మాణాలను రెగ్యులరైజ్‌ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇకపోతే తెలంగాణ సాధించుకున్న తరువాత విద్యార్థుల్లో, ఉద్యమకారుల్లో , ప్రజల్లో ఎంతో అసంతృప్తిగా ఉందని.. ప్రజా ప్రభుత్వం ఏర్పాటు తరువాత నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను కొత్తగా నియమించి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామన్నారు. తెలంగాణలో అవలక్షణాలతో డ్రగ్స్‌ బానిసలయ్యారన్నారు. గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. పోలీస్‌ ఉంటే ఉద్యోగం కాదు.. ఇది ఎమోషన్‌ , బాగోద్వేగం.. డ్రగ్స్‌ , గంజాయి, సైబర్‌ కైమ్ర్‌పై విూరు బలంగా పని చేస్తారని విూ పై పూర్తి విశ్వాసం ఉందని చెప్పుకొచ్చారు. తెలంగాణాలో పెట్టుబడులు తీసుకురావడంతో పాటు ప్రజల కుల వృత్తులను ఆదుకుంటూ ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. దేశ చరిత్రలోనే 18 వేల కోట్లు రూపాయలు కడుపు కట్టుకొని రైతుల అకౌంట్లలో జమ చేశామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. 18 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకే దక్కుతుందని, రుణమాఫీతో రైతన్నల కళ్లల్లో ఆనందం చూస్తున్నామన్నారు. పేదల పట్ల ప్రభుత్వం మానవతా ధోరణితో వ్యవహరిస్తుందని, 11 వేల మంది బాధితులకు రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామని రేవంత్‌ రెడ్డి హావిూ ఇచ్చారు. తెలంగాణ పోలీస్‌ అకాడేమి నుండి ఈరోజు 547 సబ్‌ ఇన్స్‌పెక్టర్లు పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ నిర్వహించారు. ట్రైనింగ్‌ పూర్తి చేసుకున్న వారిలో 145 మంది మహిళా ఎస్‌ఐలు, 402 మంది పురుషులు ఉన్నారు. 547 లో 401 మంది సివిల్‌ ఎస్‌ఐలు ఉన్నారు. అలాగే 547లో 472 మంది గ్రాడ్యూట్స్‌, 75 మంది పోస్ట్‌ గ్రాడ్యూఎట్స్‌ ఉన్నారు. వీరిలో 248 మంది ఎస్‌ఐలకు బీ టెక్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ ఉంది. పరేడ్‌ కమాండర్‌గా మహిళా ఎస్‌ఐ పల్లి బాగ్యశ్రీ వ్యవహరించారు. ట్రైనింగ్‌ పూర్తిచేసుకున్న వారిలో అత్యధికంగా 26 నుంచి ముప్పై వయసు గల అభ్యర్థులు ఉన్నారు. 283 మంది 26 నుంచి 30 సంవత్సరాల వయసు కలవారు శిక్షణ పొందారు. అలాగే 182 మంది 25 ఏళ్ళ లోపు వయసున్నవారు సబ్‌ ఇన్స్‌పెక్టర్లుగా శిక్షణ పొందారు. లా అండ అర్డర్‌ పరిరక్షణలో పోలీసులదే కీలక పాత్ర అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. పోలీసులపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని, పోలీస్‌ స్కూల్‌ ఏర్పాటుకు 50 ఎకరాలు కేటాయిస్తామని హావిూ ఇచ్చారు. డ్రగ్స్‌ గంజాయిపై పోలీసు సిబ్బంది ఉక్కుపాదం మోపుతున్నామన్నారని ప్రశంసించారు. ప్రజల అవసరాలు తీర్చేవిధంగా కాంగ్రెస్‌ ప్రజాపాలన చేస్తోందని స్పష్టం చేశారు. గత సర్కార్‌ హయాంలో టిఎస్‌ పిఎస్‌ సిలో లీకేజీలు జరిగాయని, నిరుద్యోగల అసంతృప్తితోనే ప్రజాపాలన వచ్చిందని రేవంత్‌ రెడ్డి తెలియజేశారు. ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రేవంత్‌ వివరించారు. టిఎస్‌ సిపిఎస్‌ పై నిరుద్యోగులకు ఎలాంటి అనుమానాలు లేవని, గతంలో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసే పరిస్థితి వచ్చిందని, ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు వరసగా ఇస్తున్నామని వివరించారు. ఇదే వేదికపై నుంచి పోలీసులకు వరాలు ప్రకటించారు. పోలీసుల పిల్లల కోసం రెండు రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ప్రారంభించ బోతున్నట్టు వెల్లడిరచారు. హైదరాబాద్‌లో ఒకటి వరంగల్‌లో రెండోది నిర్మిస్తామని హావిూ ఇచ్చారు. హైదరాబాద్‌లో 50 ఎకరాల్లో పోలీసుల పిల్లల కోసం రెసిడెన్షియల్‌ పోలీస్‌ స్కూల్‌ ఏర్పాటు చేస్తామన్నారు. రాబోయే రెండేళ్లలో హైదరాబాద్‌లో పోలీస్‌ స్కూల్‌ ప్రవేశాలు మొదలు పెట్టేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. పోలీసు ఉద్యోగమనేది బాధ్యతమాత్రమే కాదని… భావోధ్వేగమని అన్నారు. తెలంగాణను పునర్నిర్మించి, భవిష్యత్‌ తరాలకు బాటలు వేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు రేవంత్‌. ఏ సమస్య వచ్చినా ముందుగా అందుబాటులో ఉండేది పోలీసులేనని అందుకే వారు ప్రజలతో ఫ్రెండ్లీగా ఉండాలని సూచించారు. తెలంగాణను కాపాడుకునేందుకే ఖాకీ డ్రస్సులనే విశ్వాసం ప్రజలకు కల్పించాలని అన్నారు. అదే టైంలో తెలంగాణ యువతను వ్యసనాల బారిన పడేస్తున్న డ్రగ్స్‌, గంజాయి, సైబర్‌ నేరాలపై ఉక్కు పాదం మోపాలని సూచించారు. అందరిని చూస్తోంటే తెలంగాణ డ్రగ్స్‌ రహితంగా మారుతుందన్న నమ్మకం కలుగుతోందన్నారు. డ్రగ్స్‌, గంజాయిపై ఉక్కు పాదం మోపుతామని… డ్రగ్స్‌ పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టాలని అన్నారు. కాస్మెటిక్‌ పోలీసింగ్‌ కాకుండా కాంక్రీట్‌ పోలీసింగ్‌ అవసరమని సిఎం రేవంత్‌ అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ బాధితులకు మాత్రమే నేరస్తులకు కాదన్నారు. తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర చాలా ముఖ్యమన్నారు. యువత ప్రాణత్యాగంతో సాదించుకున్న తెలంగాణ తొమ్మిదేళ్లుగా అనేక సమస్యలు ఎదుర్కొందన్నారు. నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరలేదని గుర్తు చేశారు. అన్నింటినీ చూసిన ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారని తెలిపారు. వారి దయతో ప్రజాప్రభుత్వ ఏర్పడిరదని వివరించారు. తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేసినట్టు పేర్కొన్నారు. ఒక్కో వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ వచ్చామని ఇప్పుడు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కూడా ప్రక్షాళించామన్నారు. గ్రూప్‌ 2 పరీక్ష వాయిదా వేసి నిరుద్యోగులకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేసారు. తెలంగాణలో నిరుద్యోగ యువకులు ఉత్సాహంతో పరీక్షలకు సిద్ధం అవుతున్నారని ఆకాంక్షించారు. తమ ప్రభుత్వం పెట్టుబడులు తీసుకురావడం, ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా రైతన్నలు, నేతన్నలు, గీతన్నలను ఆదుకుంటోందన్నారు. ఈ కార్యక్రమంలో డిజిపితో పాటు పలువురు పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.
వరద బాధితులకు తెలంగాణ పోలీసుల రూ.11కోట్ల విరాళం
తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం పోలీసులు ఒకరోజు జీతాన్ని విరాళంగా అందజేశారు. మొత్తం రూ.11.06 కోట్లు ఇచ్చారు. దీనికి సంబంధించిన చెక్కును సీఎం రేవంత్‌రెడ్డికి డీజీపీ జితేందర్‌ అందజేశారు.తెలంగాణ పోలీసు అకాడవిూలో పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌కు హాజరైన సీఎంకు డీజీపీ చెక్కు అందించారు.