చెరువు కట్ట మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. రాజంపేట్ మండల కేంద్రంలో ఊర చెరువు కట్ట ఇటీవల కురిసిన వర్షాలకు కోతకు గురైన విషయం తెలుసుకున్న కలెక్టర్ గురువారం చెరువు కట్టను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడారు. అధికారులు సమన్వయంతో పనిచేసి చెరువు కట్ట మరమ్మత్తు పనులను తక్షణమే పూర్తి చేయాలని కోరారు. అలుగు సమీపంలో మరమ్మత్తులు చేయించాలని సూచించారు. కట్ట కుంగిపోయిన చోట మొరం పోయించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు వీఆర్ఏలు పాల్గొన్నారు. 2 Attachments
మిర్యాలగూడ. జనం సాక్షి
బోధిధర్మ ఆయుర్వేదం ఆధ్వర్యంలో డాక్టర్ పండిట్ శ్రీనివాస్ ఆరోగ్య భోజనం కార్యక్రమాన్ని జనయేత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మునీర్ ప్రారంభించటం జరిగింది. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కల్తీ రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో అనేక మంది మొండి వ్యాధుల బారిన పడుచున్నారని , దీనికి ఆయుర్వేదం చక్కటి పరిష్కారం అని సూచించారు. ఈ కార్యక్రమములో పాల్గొన్న కౌన్సిలర్ బోధిధర్మ సేవలు మిర్యాలగూడలో అందుబాటులో రావటాన్ని చాల సంతోషం వ్యక్తపరిచారు. ప్రముఖ సంఘకర్త చిలకరాజు శ్రీను మాట్లాడుతూ భోజనం సరియైన పద్దతిలో తీసుకుంటే ఏ వ్యక్తి జబ్బు బారిన పడాల్సిన పరిస్థితి ఏర్పడదని వ్యాఖ్యానించారు. డాక్టర్ శ్రీనివాస్ పులిసిన మజ్జిగ చికిత్స గురించి వివరంగా చెప్పారు. తాను చేసే వైద్యం, షడ్రుచులను వైద్యంలో జోడించడం వలన ఇంతకుమించి ఫలితాలు వస్తున్నాయని వివరించారు. తదనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరు షడ్రుచుల భోజనం చేశారు .
ప్రతిరోజు ఈ భోజనంలో పాల్గొనేవారు 9505596430 నంబర్ లో సంప్రదించాలని కోరారు.