చెరువు నిండా నీరు…. రైతులకు చేరిన నీరు

* అద్వాన పరిస్థితుల్లో కాలువలు,
* పట్టించుకోని అధికార యంత్రాంగం పాలకులు,
* రైతులకు తప్పని ఎదురుచూపులు,
* గుర్రపు డెక్క తో పేరుకుపోయిన పంట కాలువలు,
ఖానాపురం ఆగష్టు 29జనం సాక్షి
 ధాన్యాగారం గా పేరుగాంచిన పాకాల సరస్సు నిండా నీరు ఉన్నా కూడా పాకాల ఆయకట్టు రైతులకు మాత్రం చుక్క నీరు అందడం లేదు పాకాల సరస్సు షట్టర్లు  శిధిలావస్థలో ఉండడంతోపాటు, తుంగ బంధం కాలువ మైసమ్మ గుడి వద్ద పంట కాలువ లో గుర్రపు డెక్క ఆకు పేరుకుపోవడంతో చివరి ఆయకట్టు రైతులకు చుక్క నీరు చేరకపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు మాత్రం పాకాల ఆయకట్టు మరమ్మతులకు 200 కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని  పాలకులు మాటలకే పరిమితమయ్యే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువలో పేరుకుపోయిన గుర్రపు డెక్క ఆకు తో చివరి ఆయకట్టుకు నీరు చేరకపోవడంతో పాటు చోట్ల ముగ్గులు పోయడం తో పంట పొలాలు నీట మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తుంగ  బంధం కాలువలో కాలువలు పేరుకుపోయిన గుర్రపు డెక్క ఆకు ను తొలగించి చివరి ఆయకట్టుకు నీరు అందించాలని పలువురు రైతులు కోరుతున్నారు.