చెస్‌ క్రీడాకారులకు ఆర్థిక సాయం


ఉదారత చాటుకున్న ఎ మ్మెల్సీ కవిత
నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): ఎ మ్మెల్సీకల్వకుంట్ల కవిత మరోమారు తన ఉదారతను చాటుకున్నారు. నేపాల్‌లో జరిగే అంతర్జాతీయ చెస్‌ పోటీలకు నిజామాబాద్‌ జిల్లాలోని ఇద్దరు నిరుపేద బాలికలు ఎంపికయ్యారు. వారికి ఆర్థిక సహాయం అందించి కవిత గొప్ప మనసును చాటుకున్నారు. జిల్లాకు చెందిన నర్సింగరావుకు ఇద్దరు కుమార్తెలు హర్షిత, రిషితలు చెస్‌ క్రీడాకారిణిలు. నిజామాబాద్‌ లో ప్రాథమిక విద్యాభ్యాసం చేస్తున్న వీరిద్దరూ అనేక చెస్‌ పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు.

త్వరలో నేపాల్‌లో జరిగే ఇండో` నేపాల్‌ ఇంటర్నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు రిషిత, హర్షిత ఎంపికయ్యారు. ఖాట్మాండ్‌ లో ఈ నెల 14,15 న చెస్‌ పోటీలు జరగనున్నాయి. అయితే నర్సింగరావు కుటుంబ ఆర్థిక పరిస్థితిని పలువురు, ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకొచ్చారు. సోమవారం నిజామాబాద్‌ లో పర్యటించిన ఎమ్మెల్సీ హర్షిత, రిషితలను అభినందించారు. అంతేకాదు టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు
కావాల్సిన ఆర్థిక సాయాన్ని అందజేశారు.వారికి అన్ని రకాలుగా అండగా ఉంటానని హావిూ ఇచ్చారు. ఆర్థిక సాయం అందించి భరోసా ఇచ్చిన ఎమ్మెల్సీ కవితకు నర్సింగరావు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.