చేపలకు బదులు కరెన్సీ నోట్లు లభ్యం
గౌహతి జూన్ 27 : చేపలు పట్టుకోవటం వారికి జీవనాధారం. ఏ రోజు చేపలు దొరికితే ఆ రోజు వారికి కడుపు నిండేది. ఎప్పటిలాగానే చేపలు పట్టటానికి వెళ్లారు. వెట్‌లాండ్‌లోని బీల్ కాలువలోకి దిగారు. ఆశ్చర్యం చేపలకు బదులు కరెన్సీ నోట్లు నీటిమీద తేలియాడుతూ కనిపించాయి. వాళ్ల కళ్లను వాళ్లే నమ్మలేకపోయారు. అవి కూడ పది రూపాయలు లాంటి చిన్న నోట్లు కాదు. అన్నీ రూ.500,రూ.100 0 నోట్లే. ఇంకేముంది వలలు పక్కనపడేసి నదిలోకి నోట్ల కోసం పోటిపడ్డారు.దాదాపు ఒకటిన్నర నుంచి రెండు లక్షల వరకు నోట్లు లభించినట్లు అంచనా.