చేపల వేటకు వెళ్ళి ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

 రాయికొడ్ అక్టోబర్ 22 (జనంసాక్షి)   రాయికొడ్. మండల పరిధిలోని హస్నబాద్ గ్రామం లో చేపల వేటకు వెళ్ళి ప్రమాదవశాత్తు వ్యక్తి మరణించడం జరిగిందని ఎస్సై ఏడుకొండలు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే మృతుడి తల్లి వడ్డే నాగమ్మ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిందని ఎస్సై తెలిపారు. హస్నబాద్ గ్రామానికి చెందిన వడ్డే నాగమ్మ రెండవ కొడుకు వడ్డే శంకర్ రోజు లాగే శనివారం ఉదయం 6 గంటలకు చేపల వేటకు వెళ్ళాడు.తనతో పాటు మిగతా వారు కూడా చేపల వేటకు వెళ్ళారు ఉదయం 10 గంటల సమయం లో మిగతా వారు తిరిగి రగ శంకర్ రాలేదు. కుటుంబ సభ్యులు మిగతా వారు కలిసి మంజీర బ్యాక్ వాటర్ లో వెతికగా అందాజ మధ్యాహ్నం 2 గంటల సమయం లో శవమై దొరకటం తో కుటుంబ సభ్యులు ఆందోనకు గురైనారు. కుటుంబ సభ్యులు పోలీస్ లకు సమాచారం ఇవ్వటం తో పోలీస్ లు వచ్చి శవాన్ని వెలికితీసి కేసు నమోదు చేశారు. పిర్యాదు లో ఎవరి పై అనుమానం లేదని వడ్డే నాగమ్మ తెలిపిందని కేసు నమోదు చేశామని ఎస్సై ఏడుకొండలు    ఏఎస్ఐ ఎస్ఐ   మామయ్య తెలిపారు.