చేప మందుకు పోటెత్తిన జనం
హైదరాబాద్ ,జూన్ 8(జనంసాక్షి):మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. బత్తిన సోదరులు ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలోని పది జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనం చేప ప్రసాదం కోసం తరలివచ్చారు. వారికోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. 32 కౌంటర్లలో చేపప్రసాదాన్ని పంచుతున్నారు. 15వందల మంది పోలీసులు, 11 వందల మంది వలంటీర్లు బందోబస్తు ఏర్పాటులో నిమగ్నమయ్యారు. రేపు ఉదయం వరకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. ఐదు లక్షల మందికి సరిపడా ప్రసాదం సిద్ధం చేశారు.