చోరీకి యత్నించి దుకాణానికి నిప్పు
నవీపేట : నిజామాబాద్ జిల్లా నవీపేటలోని రామనాధం ఎరువుల దుకాణంలో దుండగులు చోరీకి యత్నించి నిప్పు పెట్టారు. నిన్న రాత్రి తలుపులు పగలగొట్టి దుకాణంలోకి దొంగలు ప్రవేశించారు. అయితే నగదు దొరక్కపోవడంతో దుకాణానికి నిప్పు పెట్టి వెళ్లారు. ఈ ఘటనలో రూ. లక్షకుపైగా ఆస్తినష్టం జరిగినట్లు దుకాణం యజమాని తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.