ఛలో హుజూరాబాద్ వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ
నిజామాబాద్,ఆగస్ట్11(జనం సాక్షి): గ్రామాల్లో స్వచ్ఛదనంతోపాటు పచ్చదనం సంతరించుకునేందుకు వివిధ పనులు నిర్వహిస్తున్న గ్రామ పంచాయితీ సిబ్బంది సమస్యలు, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ సమస్యల పరిష్కారానికి రాష్టప్రభుత్వం చొరవ చూపకపోవడం అత్యంత బాధాకరjైున విషయమని గ్రామ పంచాయితీ కార్మికుల జిల్లా గౌరవ అధª`యక్షుడు జంగం గంగాధర్ అన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈనెల 20న తలపెట్టిన ఛలో హుజురాబాద్ కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్లను జంగం గంగాధర్ స్థానిక గ్రామ పంచాయితీ కార్మికుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జంగం గంగాధర్ మాట్లాడుతూ.. గ్రామాలు పరిశుభ్రంగా ఉంచేందుకు గ్రామ పంచాయితీ కార్మికులు చేస్తున్న సేవ వెలకట్టలేనిదని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించి, వారి సమస్యలను పరిష్కారమవుతాయని పేర్కొని, తిరిగి గ్రామ పంచాయితీ కార్మికులు ఊసే ఎత్తకపోవడం విచారకరమని అన్నారు. ఎన్నో వ్యయ, ప్రయాసలను ఎదుర్కొని తమ జీవితాలను నెట్టుకొస్తున్న గ్రామ పంచాయితీ, మున్సిపల్ కార్మికుల సమస్యలు ప్రభుత్వం పరిష్కారం చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 20న తలపెట్టిన ఛలో హుజురాబాద్ కార్యక్రమానికి భారీగా గ్రామ పంచాయితీ, మున్సిపల్ కార్మికులు తరలిరావాలని సూచించారు. ఇకనయినా ప్రభుత్వం మేలుకొని గ్రామ పంచాయితీ కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆందోళన కార్యక్రమాలు ఉధతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు సాయిశఱ, రెహమత్, సంతోష్, లింగం, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.