ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో భారత్ బెల్జియం పై 1-0 తేడాతో విజయం
మెల్‌బోర్న్ ,డిస్శెబ్, 6 (టన్శసలక్ఞ్ష) : ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత జైత్రయాత్ర కొనసాగుతోంది. నాకౌట్ స్టేజ్‌లో కూడా దుమ్మురేపుతోంది. లీగ్ స్టేజ్‌లో జర్మనీ చేతిలో ఓడినప్పటకీ… ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోని టీమిండియా కీలకమైన మ్యాచ్‌లో బెల్జియంను నిలువరించింది. 1-0 తేడాతో ఆ జట్టును ఓడించి సెవిూస్‌కు దూసుకెళ్ళింది. మ్యాచ్ ప్రారంభం నుండే దూకుడుగా ఆడడం భారత్‌కు లాభించింది. 12వ నిమిషంలో నితిన్ తిమ్మయ్య గోల్ చేసి జట్టుకు ఆధిక్యాన్నందించాడు. తర్వాత స్కోర్ సమం చేసేందుకు బెల్జియం తీవ్రంగా ప్రయత్నించినప్పటకీ… భారత్ డిఫెన్స్‌ను ఛేదించలేకపోయింది. అదే సమయంలో భారత్ గోల్‌కీపర్ కూడా బెల్జియం దాడులను సమర్థంగా అడ్డుకున్నాడు. సెకండాఫ్‌లో మరో గోల్ చేసేందుకు మన ఆటగాళ్ళు వేగంగా ఆడినా సక్సెస్ కాలేకపోయారు. అయితే బెల్జియం దాడులను సమర్థంగా తిప్పికొట్టడంతో చివరికి 1-0 తేడాతో మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు. భారత ఆటగాడు సర్ధార్ సింగ్‌కు ఇది 150 మ్యాచ్ కావడం విశేషం. కాగా ఈ విజయంతో భారత్ 1982 తర్వాత తొలిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీ సెవిూస్‌కు చేరుకుంది.