ఛార్జీల పెంపుపై విశాఖ ఉద్యమాన్ని నిర్మిస్తాం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు
హైదరాబాద్: విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఆమోదం మేరకే డిస్కంలు పెంపు ప్రతిపాదనలు చేశాయని ఆయన తెలిపారు. అయితే కొందరు కాంగ్రెస్ నేతలు ఛార్జీల పెంపున వ్యతిరేకిస్తున్నట్లు నాటకలాడుతున్నారని ఆరోపించారు. ఛార్జీల భారంలో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి విశాల ఉద్యమన్ని నిర్మిస్తామని ఆయన హెచ్చరించారు.