జక్లేర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కు వినతిపత్రం అందజేసిన గ్రామస్తులు

మక్తల్ జూలై 27 (జనంసాక్షి) 167 జాతీయ రహదారిపై ప్రధాన కూడలిగా ఉన్న జక్లేర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ బుధవారం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డికి ఆ గ్రామ ఐకాస నాయకులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జక్లేర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. నారాయణపేట గద్వాల రాయచూర్ హైదరాబాద్ పట్టణాలకు వెళ్లెందుకు ప్రధాన కూడలిగా ఉన్న జక్లేర్ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. దీనికి తోడు జక్లేర్ పరిసరాల్లో గుడిగండ్ల, జవళపురం రామసముద్రం, సామాన్ పల్లి, మంతన్ గౌడ్, ఎర్నగన్ పల్లి, కాట్రేపల్లి, నర్సిరెడ్డిపల్లి, పాతర్ చెడ్, పులిమామిడి గ్రామాల ప్రజలు ప్రతినిత్యం జక్లేర్ మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. జక్లేర్ ను మండల కేంద్రం చేస్తే ప్రభుత్వ భవనాలు నిర్మించేందుకు కావలసిన స్థలం ఇచ్చేందుకు దాతలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే జక్లేర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరారు. ఎమ్మెల్యే స్పందిస్తూ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బి. నర్సింలు, ఎంపీటీసీ పారిజాత, ఉప సర్పంచ్ సంగీత, గ్రామ పెద్దలు, అఖిలపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నా