జగిత్యాలలో కుమార్తెతో సహా వివాహిత అదృశ్యం….

పట్టణంలోని విద్యానగర్ కు చెందిన బొడ్డు లత తన ఐదు సంవత్సరాల కుమార్తె శాన్విక తో సహా శనివారం ఇంట్లో నుండి వెళ్ళి తిరిగి రాలేదని పట్టణ సీఐ కిషోర్ తెలిపారు. ..

సాయంత్రం 3 గంటల సమయం లో ఇంట్లో గొడవలతో మనస్తాపం చెందిన బొడ్డు లత తన కూతురును తీసుకొని ఇంటి నుండి వెళ్లిపోయిందని భర్త
బొడ్డు రవి జగిత్యాల పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఫిర్యాదు చేశాడని సీఐ వివరించారు. ..

 

👉వీళ్ళ ఆచూకీ తెలిసిన వారు జగిత్యాల టౌన్ సీఐ సెల్ 9440795136, ఎస్ఐ సంజీవ్ సెల్
7901146346 కు సంప్రదించాలని సూచించారు.