జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ గారిని కలిసిన జగిత్యాల జిల్లా పూసల సంఘం నాయకులు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో పూసల సంఘానికి స్థలం కేటాయించాలని, పూసల కులస్తులకు జగిత్యాలలో నూతనంగా రోడ్డు పక్కన నిర్మాణం చేపట్టిన షెడ్లలో వ్యాపార పరంగా అవకాశం కల్పించాలని,రాయికల్ పట్టణంలో సంఘ భవనానికి స్థలం ఉందని పూసల సంఘ భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని వినతి పత్రాన్ని ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్ గారికి అందజేయగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు సానుకూలంగా స్పందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చేని సురేందర్, ప్రధాన కార్యదర్శి రమేష్, కోశాధికారి రాము,వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, గౌరవాధ్యక్షులు కిషన్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ వెంకన్న, ఈసీ మెంబర్ సంపత్, అధికార ప్రతినిధి సాగర్, మహిళా సభ్యురాలు గంగవ్వ,పట్టణ కార్మిక విభాగం అధ్యక్షుడు శెట్టి శ్రీనివాస్,నాయకులు చెని తిరుపతి,చేనీ కిషన్,
సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు