*జడ్చర్ల జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు *
జనం సాక్షి జడ్చర్ల :- ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు ఒక్కసారిగా బస్సులో పొగలు కమ్ముకొన్నాయి తేరుకొని ఏమి జరుగుతుందో తెలుసుకునే లోపే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు లేదంటే మరో పాలెం దుర్ఘటన తలపించేలా పెను ప్రమాదమే జరిగేది. మహబూబ్ నగర్ జిల్లా చిట్టి బోయిన్పల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో అర్ధరాత్రి రెండున్నర మూడు గంటల సమయంలో ఇంజన్ వద్ద మంటలు చెలరేగి ఆర్టిసి బస్సు మొత్తం దగ్ధమైంది. దీంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్ సురేష్ కుమార్ వెంటనే ప్రయాణికులను బస్సులో నుంచి దింపి వేయడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ 1 డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు కర్నూలు నుండి హైదరాబాదు వెళ్తుండగా జడ్చర్ల మండలం చిట్టి బోయిన్పల్లి సమీపంకి రాగానే బస్సులో ఇంజన్ వద్ద ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగడంతో వెంటనే బస్సు డ్రైవర్100 డయల్ కి సమాచారం అందించారు. వెంటనే బస్సు డ్రైవర్ బస్సులో ప్రయాణిస్తున్న 16 మంది ప్రయాణికులను దించి మరో బస్సులో చేరవేశారు. కాగా అప్పటికే మరింతగా బస్సులో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న జడ్చర్ల, మహబూబ్ నగర్ చెందిన పోలీసులు మరియు ఫైర్ ఇంజన్ సిబ్బంది వెంటనే మంటల్లో తగలబడుతున్న ఆర్టీసీ బస్సును ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే ఆర్టిసి బస్సు పూర్తిగా కాలి బూడిద అయింది. కాగా డ్రైవర్ అప్రమత్తతతో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు..
*బస్సులోనే బ్యాటరీ లో షార్ట్ సర్క్యూటే కారణం మహబూబ్నగర్ రీజినల్ మేనేజర్*
విషయం తెలుసుకున్న మహబూబ్నగర్ జిల్లా రీజినల్ మేనేజర్ శ్రీధర్ సంఘటన స్థలానికి చేరుకొని బ్రహ్మానందం గల కారణాలు అన్వేషించారు బస్సు బ్యాటరీ లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని భావిస్తున్నామని ప్రమాదంపై నిపుణులతో విచారణ చేపడతామని ఆ విచారణలో వాస్తవాలు బయటికొచ్చాక ప్రమాదం పై చర్యలు చేపడతామని రీజినల్ మేనేజర్ శ్రీధర్ పేర్కొన్నారు
*గేర్ బాక్స్ లో నుండి పొగలు రావడంతో బస్సు ఆపేశా నిమిషాల్లోనే మంటలు వ్యాపించాయి డ్రైవర్ సురేష్ కుమార్*
కర్నూల్ నుండి హైదరాబాద్ వెళ్తున్న హైదరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు లో జడ్చర్ల లోని చిట్టి బోయిన్పల్లి సమీపంలోకి రాగానే గేర్ బాక్స్ లో నుండి ఇ వాసనతో పాటు పొగలు వస్తున్నాయని గమనించి బస్సును ఆపి పొగల్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చూస్తుండగానే బస్సు బ్యాటరీ వద్దా షార్ట్ సర్క్యూట్ తో మంటలు మొదలయ్యాయి దీంతో గాఢనిద్రలో ఉన్న 16 మంది ప్రయాణికులను వెంటనే అప్రమత్తం చేసి అందరిని కిందికి దింపి వేశాను వెంటనే 100 కి కాల్ చేసి సమాచారం అందించడంతో పోలీసులు ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు ఆర్టీసీ బస్సు డ్రైవర్ సురేష్ కుమార్