జడ్పీహెచ్ఎస్ రాజాపూర్ హైస్కూల్లో హెల్పింగ్ సొసైటీ ఫౌండేషన్ ఎన్జీవో ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జడ్పీ సీఈవో హాజరయ్యారు

కోడేరు (జనం సాక్షి) ఆగస్టు 27 నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలోని రాజాపూర్ గ్రామంలో జెడ్ పి హెచ్ ఎస్ హై స్కూల్ లో విద్యార్థులకు హెల్పింగ్ సొసైటీ ఫౌండేషన్ ఎన్జీవో ఆధ్వర్యంలో నోటు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పిసి ఈ ఓ ఊషా మేడమ్ హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని జెడ్ పి హెచ్ ఎస్ హై స్కూల్ హెడ్మాస్టర్ భాస్కర్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన హెల్పింగ్ సొసైటీ ఫౌండేషన్ ఎన్జీవో సీఈవో మాట్లాడుతూ భవిష్యత్తులో మంచి ఉన్నత భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానంలోఉండే ఉద్యోగం సంపాదించుకునే విధంగా మంచి చదువులు చదవాలని మంచి అలవాట్లతో ముందుకు పోవాలని మనకు విద్యను నేర్పే గురువులను గౌరవించాలని అప్పుడే భవిష్యత్తులో మనల కూడా చాలామంది గౌరవిస్తారని విద్యార్థులకు తెలిపారు.. తోటి వారికి మనం మర్యాద ఇచ్చినప్పుడే మనకు కూడా వారు తిరిగి మర్యాద ఇస్తారని విద్యార్థులకు తెలిపారు. మన పక్క వారికి మనకు తోచిన విధంగా ఏదో ఒక రూపంలో సహాయ సహకారాలు అందించాలని తర్వాత సమయాల్లో మనకు కూడా వారి సహకారాలు ఉంటాయని తెలిపారు. హెల్పింగ్ సొసైటీ ఫౌండేషన్ ఎన్జీవో ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్న ఈ నోటు పుస్తకాలు చాలా కష్టపడి మా సంస్థ నుంచి తయారు చేశామని పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూళ్లలో యూజ్ చేసుకుని వదిలేసిన పాత పుస్తకాలను వాటిని తిరిగి మా సంస్థ ఆధ్వర్యంలో  కొత్తగా తయారు చేసి మీకు తిరిగి అందించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా మీరు రాసిన ఈ నోటు పుస్తకాలను తిరిగి వచ్చే సంవత్సరం మళ్లీ మాకు ఇవ్వాలని వాటిని మళ్లీ మేము కొత్తగా తయారు చేసి తిరిగి మీకే కొత్త  నోట్ బుక్స్ గా తయారు చేసి పంపిస్తామని వారు తెలిపారు. హై స్కూల్ హెచ్ఎం భాస్కర్ శర్మ మాట్లాడుతూ ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నందుకు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జడ్పీ సీఈవో ఉష మేడం రావడం అదేవిధంగా  హెల్పింగ్ సొసైటీ ఫౌండేషన్ ఎన్జీవో నుండి సీఈవో సుశీల్ మరియు జిల్లా గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ రమాదేవి రావడం మనకు ఎంతో అదృష్టమని సంతోషం వ్యక్తం చేశారు. మన పాఠశాలకు గత సంవత్సరం లోనే వారు ఒక కంప్యూటర్ ను మన స్కూల్కు ప్రధానం చేయడం జరిగిందని జడ్.పి.హెచ్.ఎస్ హై స్కూల్ హెచ్ఎం భాస్కర్ శర్మ,తెలిపారు. జెడ్పి సీఈవో ఉషా మేడం, మరియు హెల్పింగ్ సొసైటీ ఫౌండేషన్ సీఈవో సుశీల్, జిల్లా గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ రమాదేవి లను విద్యార్థులు తమ గిరిజన నృత్యాలతో కోలాటాలతో జాతీయ పిరమీడ్ లతో ఆకట్టుకున్నారు. విద్యార్థుల కళారూపాలకు ముగ్ధులైన ఆఫీసర్లు విద్యార్థులకు బహుమతులు ఇచ్చి వారిని అభినందిస్తూ వచ్చే సంవత్సరం జిల్లా కేంద్రంలో జరిగే ఆగస్టు 15 కు కలెక్టర్ కార్యాలయంలో  జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో రాజాపూర్ గ్రామ హై స్కూల్ విద్యార్థులచే కళారూపాలు ప్రదర్శించే విధంగా ఏర్పాట్లు చేస్తామని జెడ్పిసిఈఓ ఉషా మేడం విద్యార్థులకు హామీ ఇచ్చారు. ఈ మారుమూల గ్రామాలకు రావడానికి రోడ్లు బాగాలేవు కానీ ఈ గ్రామాల్లో ఉన్న విద్యార్థులు మాత్రం చిచ్చరపిడుగుల్లా ఉన్నారని విద్యార్థులకు అవకాశాలిస్తే చాలా ఎత్తుకు ఎదుగుతారని విద్యార్థులను అభినందించారు. వెంకటప్ప హిందీ ఉపాధ్యాయులు మాట్లాడుతూ జడ్పీ సీఈఓ కు ఒక విన్నపం చేశారు. రాజాపూర్ గ్రామంలో త్వరలో పదవ తరగతి విద్యార్థులకు స్పెషల్ గా పాఠశాల సమయం కంటే ముందు ఉదయం ఎనిమిది గంటల నుండి పాఠశాల ప్రారంభమయ్యే సమయంలో గా ప్రత్యేకమైన క్లాసులు తీసుకుంటామని విద్యార్థులకు ఆ సమయంలో టిఫిన్ ఏర్పాట్లు చేసే విధంగా ఎవరైనా ఎన్జీవోలు ముందుకు రావాలని జడ్పీ సీఈవో, హెల్పింగ్ సొసైటీ ఫౌండేషన్ సీఈవో లను కోరారు. హెల్పింగ్ సొసైటీ ఫౌండేషన్ సీఈవో సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమం ద్వారా అందించిన విద్యార్థులకు  నోటి పుస్తకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వారు విద్యార్థులను కోరారు.  కళారూపాలతో ఆకట్టుకున్న విద్యార్థులైన  కళాకారులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో  జెడ్ పి హెచ్ ఎస్ హై స్కూల్ హెచ్ఎం భాస్కర్ శర్మ, వెంకటప్ప, మల్లికార్జున్, తోటి ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
(సార్ రెండు ఫోటోలు వేయండి సార్)