‘జనంసాక్షి’ పత్రిక భేష్‌: లోకాయుక్త న్యాయమూర్తి కృష్ణాజిరావు

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 23 (జనంసాక్షి):
మన ‘జనంసాక్షి’ దినపత్రికలో ప్రచురితమవుతున్న వార్తలు స్వచ్ఛంగా ఉంటున్నాయని రాష్ట్ర ఉప లోకాయుక్త జడ్జి కృష్ణాజీ రావు ప్రశంసించారు. శనివారం ఆయన కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహంలో బస చేసిన ఆయన ‘జనంసాక్షి’లో వస్తున్న వార్తలపై ఆరా తీసి, ఆదివారం పత్రిక కార్యాలయాన్ని సందర్శించారు. జడ్జికి పత్రిక ఎడిటర్‌ ఎం.ఎం.రహమాన్‌, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఎడిటర్‌ ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా జడ్జి వార్తల సేకరణ, ప్రచురణ విధానాన్ని అడిగి తెలుసు కున్నారు. ఎడిటర్‌తోపాటు సిబ్బంది ఆయనకు ఆ వివరాలను వివరించారు. జనంసాక్షి పత్రికకు సంబంధించిన ఆన్‌లైన్‌ ఎడిషన్‌, వెబ్‌సైట్‌లను కూడా జడ్జి వీక్షించారు. వెబ్‌సైట్‌లో స్క్రోలింగులు, అలర్టులు, ఫ్లాష్‌ వార్తలను అప్‌డేట్‌ చేసే విధానాన్ని తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పత్రికలు గానీ, ఛానళ్లు గానీ విలువలను పాటించినప్పుడే ప్రజాభిమానాన్ని చూరగొంటాయన్నారు. ప్రజా సమస్యలను వెలికితీసే పత్రికలకు ఆదరణ ఎప్పుడూ ఉంటుందన్నారు. జనంసాక్షిలో వార్తలు చాలా బాగా వస్తున్నా యని, ఈ పత్రిక ప్రజాకాంక్షకు ప్రతిబింబంగా నిలుస్తోందని జడ్జి కొనియా డారు. జనంసాక్షి ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను వెలికితీస్తే, వాటిని సుమో టోలుగా స్వీకరిస్తామన్నారు. సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అధికారులు నిజాయితీగా పని చేస్తే, సమాజంలో అవినీతి, అక్రమాలకు తావుండదని పేర్కొన్నారు. ఒకవేళ అధికారులు ప్రజా సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తే, ఈ విషయాలను బహిర్గతం చేయాల్సిన బాధ్యత మీడియాపై ఉందన్నారు.
అప్పుడే అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవడానికి వీలు ఉంటుందన్నారు. పత్రికలు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులన్న సంగతి మరువకూడదని గుర్తు చేశారు. నేటి కాలంలో మీడియా కూడా కలుషితమవుతున్నట్లు అనిపిస్తున్నదని, ఇది సమాజానికి చాలా ప్రమా దకరమని హెచ్చరించారు. తమ సమస్య ల పరిష్కారంలో శ్రద్ధ చూపిస్తారని పాత్రికేయులపై ప్రజలకు ఎంతోనమ్మకం ఉంటుందని, ఆ నమ్మకాన్ని మీడి యా నిలబెట్టుకోవాలని సూచించారు. జనంసాక్షి పత్రికను ఆదర్శంగా మిగతా వారు పని చేయాలని హిత వు పలికారు. జనంసాక్షి పత్రికకు కూడా పలు సూచనలు, సలహాలు ఇచ్చా రు. చివరిగా జనంసాక్షి ఇలాగే ప్రజా పక్షాన నిలబడి సమస్యలను వెలికి తీయా లని అభిలాషించారు. మరోసారి ఎడిటర్‌కు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపి జడ్జి కృష్ణాజీ రావు సెలవు తీసుకున్నారు. ఈ సందర్శనలో జడ్జితో పాటు ఆయన సిబ్బంది, పత్రిక సిబ్బంది, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.