మన రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మకు ఘన నివాళులు*
ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర రజక ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వర్సపల్లి నర్సింహులు
జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశం, యూత్ అధ్యక్షుడు విజయ్, జిల్లా వెల్ఫేర్ కమిటీ సభ్యులు గణేష్ ఆధ్వర్యంలో ఐలమ్మ వర్థంతి వేడుకలు
తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ గారి 37వ వర్థంతి సందర్భంగా ఈరోజు మెదక్ జిల్లా కేంద్రంలో మన రజక సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర రజక ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వర్సపల్లి నర్సింహులు గారు మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం ఆ జన్మాంతం సమ సమాజ నిర్మాణానికి, బడుగు బలహీన వర్గాల భవిష్యత్తుకై, అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా, అకుంఠిత దీక్షతో రజాకార్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన విప్లవ యోధురాలు, మొక్కవోని ధైర్యంతో నిజాం నిరంకుశత్వాన్ని నిరసించిన సివంగి అని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో ఉద్యమ నేత సీఎం కేసీఆర్ గారు ఆమె పోరాటం తత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని ఆమె జీవిత చరిత్రను భావి తరాలకు అందించటానికి పాఠ్య పుస్తకాల్లో చేర్చడమే కాకుండా గత ఏడాది నుండి పెండింగ్ చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు,ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు చౌదరి మల్లేశం, నవాబు పేట యాదగిరి, చౌదరి వేణు, చౌదరి యాదగిరి, అల్సగారి కృష్ణ, యాదగిరి,ధర్మగల్ల గిరి, అల్సగారి శ్రీనివాస్,యన్ మల్లేశం, మేస్త్రి పోచయ్య,మహేందర్, భాను, చౌదరి యాదగిరి,అల్సగారి నాగరాజు,గంగేష్,బి.యాదగిరితో పాటు పట్టణ రజక సంఘం నాయకులు పాల్గొన్నారు
వర్సపల్లి నర్సింహులు, రాష్ట్ర రజక ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్రం