జనగమలో కృష్ణ, రాధ వేషధారణ తో ఘనంగా వేడుకలు
జనగామ (జనం సాక్షి)ఆగస్ట్19:కృష్ణాష్టమి పర్వదినం రోజున కృష్ణుడి ఆలయంలో నిర్వహించే సంబరాలు అంతా ఇంతా కాదు. కృష్ణాష్టమి రోజున కృష్ణయ్య ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తారు. ఇక కృష్ణుడి భక్తికి ప్రత్యేకమైన ఇస్కాన్ ఆలయాలలో సంబరాలు అంబరాన్ని తాకుతాయి. అత్యంత భక్తిభావంతో చిన్ని కృష్ణయ్య కు నిర్వహించే పూజలు, సేవలు ప్రతి ఒక్కటి విశేషంగా నిలుస్తాయి. గోపాలుడి దేవాలయాల్లో గ్రామోత్సవం , గీతాపఠనం, ఉట్టి కొట్టడం లాంటి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ కార్యక్రమంలో చిన్న పిల్లలు ఎంతో సంబరంగా ముస్తాబు అవుతారు .చర్వి, గ్రీవ ఎంతో అందంగా తయారై అందరిని ఆకర్షించినరూ ..