జనగమ పట్టణంలో వాంకుడొత్ అనిత బికోజి వారి ఆధ్వర్యంలో బంజార తీజ్ పండగ

   జనగామ  (జనం సాక్షి) ఆగస్ట్ 10:జనగామ జిల్లా కేంద్రంలో అంబారాన్ని అంటిన తీజ్ పండుగ  జనగామ రెండవ వార్డ్ కౌన్సిలర్ వాంకుడొత్ అనిత అధ్యక్షతన ఏర్పాటు చేసిన తీజ్ ఉత్సవములు. ఈ సందర్భంగా వాంకుడొత్ అనిత మాట్లాడుతూ   తీజ్ పండగ మొదటి రోజున బాగంగా తీజ్  అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది గిరిజన తండాలు.. వారి కట్టు బొట్టు సంప్రదాయ నృత్యాలు గిరిపుత్రుల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది ఈ పండగ.. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో జరిగే తీజ్ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.. తమకు మంచి వరుడు దొరకాలని పెళ్లీడు యువతులు తొమ్మిది  రోజుల పాటు నవధాన్యాల మొలకలకు పూజలు చేయడం ఈ పండుగ ప్రత్యేకత అని అమ్మ బావాని (మేరమ్మయడి) గా తొమ్మిది రోజులు పెళ్లి కాని అమ్మాయిలు ప్రత్యేకంగా పూజలు  చేస్తారని వంకుడొత్ అనిత తెలిపారు.ఈ కార్యక్రమంలో ముక్య అతిథిగా మాజీ  జెడ్పీ చైర్మన్ లాకావత్ ధన్వంతి మరియు కుల బంధువులుతదితరులు పాల్గొన్నారు.