జపాన్‌ గ్రాండ్‌ ప్రీ వెంట్‌ రద్దు


టోక్యో,ఆగస్ట్‌18(జనంసాక్షి): ఫార్ములావన్‌కు చెందిన జపాన్‌ గ్రాండ్‌ ప్రీ ఈవెంట్‌ను ఈ ఏడాది రద్దు చేశారు. ఆ ఈవెంట్‌ను అక్టోబర్‌ 8 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించాల్సి ఉంది. కానీ దేశంలో కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గ్రాండ్‌ ప్రీ ఈవెంట్‌ను రద్దు చేశారు. జపాన్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎఫ్‌వన్‌ ఓ ప్రకటనలో చెప్పింది. అయితే ఫార్ములా వన్‌కు చెందిన కొత్త షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. 23 రౌండ్లు జరిగే సీజన్‌ సర్క్యూట్‌లో జపాన్‌ది 17వ రౌండ్‌. ఇప్పటికే ఆస్ట్రేలియా, చైనా, కెనడా, సింగపూర్‌ రేసులను రద్దు చేశారు. జపాన్‌లో ఎఫ్‌వన్‌ రేసు వరుసగా రద్దు కావడం ఇది రెండవసారి.