జమిలితో ఐక్య కూటమిని దెబ్బతీసే యత్నాలు

జమిలి ఎన్నికలతో విపక్షాల ఐక్యతను దెబ్బతీయాన్నలది ప్రధాని మోడీ లక్ష్యంగా ఉనట్లుగా అనిపిస్తోంది. కర్నాటక పరిణామాల తరవాత విపక్షాలు అంతా ఒక్క్కటయిన తీరు చూస్తుంటే రానున్న కాలంలో మోడీకి గట్టి చెక్‌ పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే ముందస్తు ఎన్నికల ముసుగులో జమిలి జంప చేస్తున్నట్లుగా ఉంది. ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే పన్ను, అంటూ మంచి మాటలు చెప్పినా ఒరిగిందేవిూ లేదు. జమిలితో కూడా ఒరిగేదేవిూ లేదు. ఎందుకంటే మధ్యంతరం లాంటి ఎన్నికలు వస్తే లేదా..ప్రభుత్వాలు కూలిపోతే జమిలికి జవాబు ఉండదు. రాజ్యాంగపరంగా ముందు ఎన్నికలకు సంబంధించి కీలకమైన సవరణలు జరగకుండా దీనిపై ఎంత చర్చ చేసినా లాభం లేదు. దీనిపై పార్లమెంటులో చర్చ సాగాలి. జమిలి ఎన్నికలను జరిపితే ఐదేళ్ల పాటు కేంద్రా,రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగేలా చూడాలి. సాధ్యాసాధ్యాలు చర్చించాలి. ఈ దేశంలో ఏకకాలంలో ఎన్నికల వ్యవస్థను రూపొందించుకోవాల్సి ఉంది.రాజ్యాంగం మొదటి అధికరణమే భారత దేశం రాష్ట్రాల సమాఖ్య అని నిర్వచించుకున్నాం. ఈ జమిలి చర్చ రాజకీయ ప్రయోజనాలను బట్టి వారు మాట్లాడుతుండటంలో ఆశ్చర్యం లేదు. మారిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఎన్నికలు ముందుగా రావాలని కోరుకోవడం లేదు. అయితే ఎన్నికలు ఎప్పుడైనా సిద్దమే అని కెసిఆర్‌ కోరుకుంటున్నారు. జమిలి ఎన్నికలకు సంబంధించి ముందుగా రాజ్యాంగంలో ప్రమాణం ఉండాలి.

అప్పుడే చర్చలకు సార్థకత ఉంటుంది. ప్రస్తుత వాతావరణంలో జమిలి అనేబదులు ముందస్తు ఎన్నికల

సన్నాహాలు అంటే బాగుంటుంది. ప్రణాళికాసంఘం, యుజిసి వంటివన్నీ రద్దు చేసిన రీతిలోనే ఇప్పుడు ఒకే ఎన్నికల వ్యూహం కోరుకుంటున్నారు. అనేక సర్వేలలో దిగజారుతున్న మోదీ రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌ ఎన్నికలతో పాటే కేంద్ర ఎన్నికలను నిర్వహించాలన్న నిర్ణయంతో ఉన్నట్లుగా ఉంది. విడిగా పెట్టి ఓడిపోతే 2019 ఓటమికి రంగం సిద్ధం అవుతుందనే జంకుతో ఈ చర్చ తీవ్రం చేశారన్న విమర్శలు కూడా ఉన్నాయి. తొలుత నీతిఆయోగ్‌లో స్వయంగా ప్రధాని ఈ చర్చ లేవనెత్తారు. తర్వాత జాతీయ లా కమిషన్‌ వివిధ పార్టీల అభిప్రాయాలను సేకరించడం మొదలెట్టింది. మొత్తంగా రాజకీయ పార్టీలు కూడా భిన్నాభి ప్రాయాలు వ్యక్తం చేశాయి. ఏదేమైనా ఒకవేళ ఆ మూడు రాష్ట్రాలతో కలిపి ఎన్నికలకు వెళ్లాల్సి వస్తే మోడీని ఎవరూ కాదనరు. కానీ బిజెపి తీసుకుంటున్న లేదా మోడీ తరహా నిర్ణయాలు ఇతరలకు ఆమోద యోగ్యంగా లేవు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వ నిర్ణయాలను దుయ్యబడుతున్నారు. బీజేపీ తిరుగుబాటు నేత యశ్వంత్‌ సిన్హా,శతృఘ్ను సిన్హా లాంటి వారు కూడా అనేక సందర్భాల్లో విమర్శలు చేశారు. ప్రస్తుతం బిజెపిలో ఉంటూనే కొందరు నేతలు మోడీ నిర్ణయాలను తప్పుపడుతున్నారు. అందులో జమిలి ఆలోచనలను కూడా తూర్పారా బడుతున్నారు. మోడీ విధానాలపై వీరు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఈ దశలో విపక్షలు మళ్లీ ఐక్యంగా సాగుతున్నాయి. ఎవరికి వారే ఐక్యకూటమికి పునాదులు వేయాలనుకుంటున్నారు. పవార్‌,మమతా బెనర్జీ మాత్రమే కాదు, చాలామంది ప్రాంతీయ పార్టీల నాయకులు, ముఖ్యమంత్రులు అవకాశం వస్తే ఢిల్లీ గద్దెను ఎక్కాలనే కుతూహలంతో ఉన్నారు. బీజేపీయేతర పార్టీలు ఒకే వేదికపైకి వస్తే, సమిష్టి నాయకత్వం ఏర్పడే సూచనలున్నాయి. ఏకాభిప్రాయం తో వీరిలో ఎవరో ఒకరు నాయకులు కావచ్చు. రాష్ట్రాలలో తమ మధ్య విభేదాలు ఉన్నప్పటికీ, కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా చేతులు కలుపాలని సోనియా పిలుపునిచ్చారు. ఈ కూటమి వల్ల రాజకీయ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందా అన్నది కాలం నిర్ణయిస్తుంది. అయితే దీనిని గండి కొట్టడమే లక్ష్యంగా జమిలి వ్యవహారం తెరపైకి వచ్చిందనడంలో సందేహం లేదు. మొత్తానికి ఏడాదికి ముందే ఎన్నికల వేడిని

ఎక్కించే ప్రయత్నాల్లో నేతలు ఉన్నారు. దీనికితోడు ప్రధాని మోడీ కూడా రానున్న మూడు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎక్కడకు వెళ్లినా ఎన్నికల ప్రసంగం ప్రారంస్తున్నారు. అయితే నోట్లరద్దు, జిఎస్టీ వంటి అంశాలతో ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అందిపుచ్చుకుని కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. రాష్ట్రాల్లో గుజరాత్‌ తరహా అంటూ అన్ని వర్గాలను కలుపుకుని పోయే ప్రయత్నాల్లో ఉంది. ఇటీవల సోనియా జరిపిన ఓ సమావేశంలో ఇదే ప్రధాన మంత్రంగా సాగుతున్నారు. ప్రధానంగా మోడీ విధానాలను వ్యతిరేకిస్తున్న వారిని కలుపుకునిపోవాలని చూస్తున్నారు. రాష్ట్రాలలో తమ మధ్య విభేదాలు ఉన్నప్పటికీ, కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా చేతులు కలుపాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయ పార్టీలతో స్నేహం కోసం ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలను కలుపుకుని కేంద్రంలో కలిసి పనిచేసేలా సార్వత్రిక ఎన్నికలకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలలో బలమైన పునాది కలిగిన నాయకులను, వ్యవస్థల్లో ఉన్న వ్యక్తులను కలుపుకుని పోవాలని చూస్తున్నారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచినప్పటికీ మోదీ జనాకర్షణ సన్నగిల్లినదని తెలిసిపోయింది. ఇటీవల రాజస్థాన్‌,యూపి ఉపఎన్నికలలో కూడా బీజేపీ ఎదురు దెబ్బలు తిన్నది. బీజేపీ బలహీనపడితే, ఆ పరిస్థితి ఒక్క కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే లాభించదు. రాష్ట్రాలలో బీజేపీ బలహీన పడితే కాంగ్రెస్‌ కొంత లబ్ధి పొందవచ్చు. బీజేపీ ఎంత బలహీనపడినా, కాంగ్రెస్‌ పూర్వ వైభవాన్ని సంతరించు కోవడం అనుమానమే. ఈ దశలో ప్రాంతీయ పార్టీలను కలుపుకుని పోవాలన్న కాంగ్రెస్‌ ఆశలకు గండికొట్టేలా ముందస్తు వ్యూహాలను ప్రధాని మోడీ పన్నారని స్పష్టం అవుతోంది. దానికే జమిలి పేరుతో కోటింగ్‌ ఇస్తున్నారు. ఒకవేళ ముందుస్తుకు వెళితే కాంగ్రెస్‌తో పాటు, దానికి మద్దుతగా నిలుస్తున్న పార్టీలను దెబ్బతీయాలన్నది వ్యూహంగా కనిపిస్తోంది.

————————–