జమ్మూలో హోరాహోరీ కాల్పులు

2

– కొనగుసాతున్న ఆపరేషన్‌

– ఏడుకు చేరిన మృతుల సంఖ్య

శ్రీనగర్‌ ,ఫిబ్రవరి 21(జనంసాక్షి): జమ్ముకశ్మీర్‌లోని పాంపోర్‌లో భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో మరో ఆర్మీ కెప్టెన్‌ తుషార్‌ మహాజన్‌ మృతి చెందారు. దీంతో కాల్పుల్లో మృతి చెందినవారి సంఖ్య ఇప్పటివరకు ఏడుకు చేరింది. మరోవైపు భద్రతాదళాల ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. శ్రీనగర్‌ సవిూపంలోని పాంపోర్‌లో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్‌ రెండో రోజు కొనసాగుతోంది. ఈ ఉదయం ఆర్మీ అధికారి పవన్‌కుమార్‌ ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారు. తాజాగా మరో ఆర్మీ జవాను సహా కెప్టెన్‌ మృతి చెందారు. నిన్న సాయంత్రం పాంపోర్‌ వద్ద సీఆర్‌పీఎఫ్‌ వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు, సైన్యానికి చెందిన ఒకరు సహా ఓ పౌరుడు మృతిచెందారు. జమ్ము-శ్రీనగర్‌ జాతీయ రహదారిపై పాంపోర్‌ సవిూపంలోని వ్యవస్థాపక అభివృద్ధి సంస్థ భవనంలో ఉగ్రవాదులు దాక్కుని ఉండటంతో ఆ భవనంలో పౌరులను భద్రతా దళాలు సురక్షితంగా బయటకు పంపాయి. ఆ భవనం నుంచే ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. ఈ ఉదయం 22ఏళ్ల ఆర్మీ అధికారి పవన్‌కుమార్‌ను ఉగ్రవాదులు హతమార్చారు. ఇప్పటికే ఇలాంటి రెండు క్లిష్టమైన ఆపరేషన్లలో పవన్‌కుమార్‌ విజయవంతంగా ఉగ్రవాదులను మట్టుబెట్టినా.. ఈసారి మాత్రం ముష్కరుల తూటాలకు బలైపోయారు.  శ్రీనగర్‌ సవిూపంలోని పాంపోర్‌లో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఈ ఉదయం ఆర్మీ అధికారి పవన్‌కుమార్‌ ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారు. తాజాగా మరో ఆర్మీ జవాను మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. నిన్న సాయంత్రం సీఆర్‌పీఎఫ్‌ వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు, సైన్యానికి చెందిన ఒకరు సహా ఓ పౌరుడు మృతిచెందారు. జమ్ము-శ్రీనగర్‌ జాతీయ రహదారిపై పాంపోర్‌ సవిూపంలోని వ్యవస్థాపక అభివృద్ధి సంస్థ(ఈడీఐ) భవనంలో ఉగ్రవాదులు దాక్కుని ఉండటంతో ఆ భవనంలో పౌరులను భద్రతా దళాలు సురక్షితంగా బయటకు పంపాయి. ఆ భవనం నుంచే ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. ఈ ఉదయం 22ఏళ్ల ఆర్మీ అధికారి పవన్‌కుమార్‌ను ఉగ్రవాదులు హతమార్చారు. ఇప్పటికే ఇలాంటి రెండు క్లిష్టమైన ఆపరేషన్లలో పవన్‌కుమార్‌ విజయవంతంగా ఉగ్రవాదులను మట్టుబెట్టినా.. ఈసారి మాత్రం ముష్కరుల తూటాలకు బలైపోయారు. ఉగ్రవాదులు చొరబడిన ఈడీఐ భవనం నుంచి ఆదివారం మధ్యాహ్నం మంటలు వ్యాపించాయి. ఈ భవనంలో ఎంత మంది ఉగ్రవాదులు ఉన్నారన్న విషయంపై ఇప్పటి వరకూ ఎలాంటి స్పష్టత లేదు. ఈడీఐ భవనంలోని సిబ్బందిని, పౌరులను సురక్షితంగా బయటకు పంపామని.. ఇద్దరు నుంచి నలుగురు ఉగ్రవాదులు ఈ భవనంలో ఉండవచ్చని సీఆర్‌పీఎఫ్‌ పీఆర్‌వో భవేశ్‌కుమార్‌ తెలిపారు.