జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇవ్వండి :

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) అక్టోబర్ 10 : జిల్లాలో అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లు లేదా, ఇళ్ళస్థలాలు మంజూరు,ఇతర సమస్యల పరిష్కారం గురించి..
జిల్లావ్యాప్తంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేస్తున్న జర్నలిస్టులు ప్రభుత్వం నుంచి ఇళ్ళు లేదా ఇళ్ళస్థలాలు పొందేందుకు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు. చాలామంది జర్నలిస్టులు పేదరికంలో సొంత ఇళ్ళు లేక అద్దె ఇళ్ళల్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్నారు. కావున తమరు ప్రభుత్వం నుంచి జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ళు లేదా ఇళ్ళస్థలాలు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు ,తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా నాయకులు.

పెండింగ్ లో ఉన్న ఇతర సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించాలని కోరుతున్నాం. ఈ సమస్యలపై నేడు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా “జర్నలిస్టుల డిమాండ్స్ డే” పాటిస్తూ కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. ఇందులో భాగంగా మ సమస్యలను పరిష్కరించాలని తమరికి విజ్ఞప్తి చేస్తున్నామని వినతి పత్రం సమర్పించారు.

డిమాండ్లు

1 సుప్రీం కోర్టు తీర్పు మేరకు
అర్హులైన జర్నలిస్టులకు ఇండ్లు, ఇళ్ళస్థలాలు ఇవ్వాలి.
2. చిన్న పత్రికలకు అక్రెడిటేషన్ కార్డులు, అడ్వర్టైజ్మెంట్స్ పెంచాలి.
3. జర్నలిస్టులకు రైల్వే రాయితీ పాస్ లు పునరుద్ధరించాలి.
4. బస్ పాస్, రైల్వే పాస్ లపై 100 శాతం రాయితీ కల్పించాలి.
5. ఆర్టీసీ బస్ రాయితీ జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు కూడా వర్తింపజేయాలి.
6. జర్నలిస్టులకు టోల్ గేట్ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాలి.
7. రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి.
8. మహిళా జర్నలిస్టుల రాత్రి పూట రవాణా సౌకర్యం కల్పించాలి.
9. జర్నలిస్టులకు ”జర్నలిస్టుబంధు” పథకం ప్రవేశ పెట్టాలి…
10. జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలి.
11. నూతన కలెక్టర్ భవనంలో జనరల్ స్టకు ప్రత్యేక గది కేటాయించాలి.

ఈ కార్యక్రమంలో జాతీయ నాయకుడు రంగముని, రాష్ట్ర నాయకుడు అక్బర్ బాషా,జిల్లా అధ్యక్షుడు,బి.గిరిబాబు, ప్రధాన కార్యదర్శి, కే. వెంకటేశ్వర్లు, ఎన్ టివి వెంకటేష్, HM టీవీ గోకరి, టీవీ 5 రాజు, ఆరిగిద్ద చారి ,రామాంజనేయులు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ నాయకులు తదితరులు పాల్గొన్నారు….