జర్నలిస్టుల అరెస్టులను ఖడించిన కేసీఆర్
హైదరాబాద్, జనంసాక్షి: బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ వద్ద తెలంగాణ జర్నలిస్టులు, న్యాయవాదులపై దాడులు, అరెస్టులను టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఖడించారు. పోలీసుల తీరును ఆయన తప్పుబట్టారు. ‘రుజువుల్లేని ఉద్యమం’ పుస్తకావిష్కరణను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు పరకాల ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.