జర్నలిస్టు శ్రీనివాస్ కుటుంబానికి అండగా దళిత జర్నలిస్టు యూనియన్.
దౌల్తాబాద్ అక్టోబర్ 18, జనం సాక్షి.
సీనియర్ జర్నలిస్ట్ కొలుపుల శ్రీనివాస్ దౌల్తాబాద్ నుంచి స్వగ్రామం దొమ్మాటకు బైక్ పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ఇటీవలే మండల పరిధిలోని లింగరాజు పల్లి గ్రామ సమీపంలో మృతి చెందాడు. మంగళవారం జర్నలిస్టు శ్రీనివాస్ కుటుంబాన్ని దళిత వర్కింగ్ జర్నలిస్ట్ వెల్బర్ సొసైటీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు జంగం రాజలింగం, దళిత వర్కింగ్ జర్నలిస్ట్ హెల్పర్ సొసైటీ సభ్యులు చంద్రం, కిరణ్, తో కలిసి శ్రీనివాస్ చిత్రపటానికి నివాళులర్పించి ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ . అధైర్య పడవద్దని దళిత జర్నలిస్ట్ వెల్ఫేర్ సొసైటీ తరపున అండగా ఉంటామని తండ్రి మృతితో చదువును మధ్యలో నిలిపివేయకుండా పై చదువులు చదివి ఉన్నతమైన స్థానం చేరుకోవాలని తండ్రి కలలను సహకారం చేయాలని జర్నలిస్ట్ శ్రీనివాస్ పిల్లలకు కుటుంబానికి భరోసా కల్పించారు. జర్నలిస్టులకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ తో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
Attachments area
ReplyForward
|