జర్నలిస్టు శ్రీనివాస్ కుటుంబానికి ఎస్సై ఆర్థిక సహాయం.

దౌల్తాబాద్ అక్టోబర్ 21, జనం సాక్షి.
దౌల్తాబాద్ మండల పరిధిలో లింగరాజు పల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దొమ్మాట గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ కొలుపుల శ్రీనివాస్ కుటుంబానికి పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా షాద్ నగర్ ఎస్సై చంద్రశేఖర్ 10,000 రూపాయలు దౌల్తాబాద్ ఏఎస్ఐ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో హోంగార్డు దేవరాజు, దౌల్తాబాద్ ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు బ్యాగరి శంబులింగం, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గొల్లపల్లి నాగేష్, కోశాధికారి లింగాల రాజిరెడ్డి సభ్యులు దుర్గ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.