జర్నలిస్ట్ సేవలు మరువలేనివి : మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి.
దౌల్తాబాద్ అక్టోబర్ 17, జనం సాక్షి.
దౌల్తాబాద్ మండల పరిధిలో దొమ్మాట గ్రామానికి చెందిన ఆంధ్రజ్యోతి జర్నలిస్టు కొలుపుల శ్రీనివాస్ మృతి పట్ల మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేసి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబానికి 50000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజానికి చేస్తున్న సేవ ఎనలేనిదని జర్నలిస్టు శ్రీనివాస్ కుటుంబాన్ని, వారి కుమారులకు నాణ్యమైన విద్య అందించేలా అన్ని విధాలుగా ఆదుకుంటామని సూచించారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ పూజిత వెంకటరెడ్డి,తెరాస మండల అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్,మాజీ జడ్పీటీసీ చిందం రాజకుమార్,ఎంపీటీసీ ల పోరం అధ్యక్షులు బండారు దేవేందర్,మాజీ సర్పంచ్ మోహన్ రావు,ఉప సర్పంచ్ సింహచలం, ఇప్ప దయాకర్,తదితరులు పాల్గొన్నారు.
Attachments area