జలదోపిడీని అడ్డుకోండి

` భారాస నేత హరీశ్‌ డిమాండ్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):ఆంధ్రా జల దోపిడీని అడ్డుకుని.. తెలంగాణ పొలాలకు నీళ్లు పారియ్యమని, అక్రమ ప్రాజెక్టును ఆపమని అడిగితే.. అది చేతగాక అడ్డుఅదుపు లేకుండా అబద్దాల ప్రవాహాన్ని నిన్న సీఎం పారించే ప్రయత్నం చేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. అసలు విషయం మాట్లాడకుండా.. విషయాన్ని పక్కదోవ పట్టించారు. మా ఎంపీ రవిచంద్ర బాగా ఆర్గ్యూ చేశారు. బనచకర్ల ప్రాజెక్టును ఆపేందుకు ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్‌ పార్టీ పూర్తిగా సహకరిస్తుంది. దీన్ని గాంధీ భవన్‌గా, రాజకీయ వేదికగా మార్చకు. అసెంబ్లీ ఏర్పాటు చేసి ఏకగ్రీవ తీర్మానం చేయ్‌. అఖిలపక్షాన్ని ఢల్లీికి తీసుకెళ్లు అని మా ఎంపీ స్పష్టంగా చెప్తే సీఎం మాత్రం రాజకీయ వేదికగా మార్చారు అని హరీశ్‌రావు మండిపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సెటైర్లు వేశారు. బహుషా బ్యాగుల విూద ఉన్న నాలెడ్జ్‌.. బేసిన్ల విూద లేదని రేవంత్‌ రెడ్డిని హరీశ్‌రావు విమర్శించారు. బేసిన్ల విూద బేసిక్‌ నాలెడ్జ్‌ లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు విూడియాతో మాట్లాడారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విూద నిన్న రేవంత్‌ రెడ్డి మాట్లాడిన మాటలు రాష్ట్ర ప్రజలు చూశారు. గత కొతకాలంగా బనకచర్లను అడ్డుకోండని మేం మాట్లాడితే.. బొడిగుండుకు, మోకాలికి ముడిపెట్టినట్టుగా నిన్న రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. అసలు విషయాన్ని పక్కనపెట్టి సొల్లు వాగుడు వాగారు ముఖ్యమంత్రి. బేసిన్ల గురించి బేసిక్‌ నాలెడ్జ్‌ లేకుండా మాట్లాడారు. ఆయనకు బహుషా బ్యాగుల విూద మంచి నాలెడ్జ్‌ ఉన్నట్టుంది కానీ బేసిన్ల విూద నాలెడ్జ్‌ లేదని నిన్నటి పీపీటీతో స్పష్టమైపోయింది. పీపీటీ పెట్టి మరి రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. దీంతో రాష్ట్రం పరువు పోయింది అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి కనీసం బేసిక్‌ నాలెడ్జ్‌ లేకుండా ఉంటారా..? అని రాష్ట్ర ప్రజలు నవ్వుకునే పరిస్థితి ఏర్పడిరది. సీఎం ఇంత అజ్ఞానంగా ఉంటాడా..? అని దేశం ముందు పరువు పోయే పరిస్థితి వచ్చింది. సీఎంకు, ఉత్తమ్‌కు కనీస జ్ఞానం లేకపోవడం ఈ రాష్టాన్రికి పట్టిన దౌర్భాగ్యం. రేవంత్‌ రెడ్డి అంతులేనటువంటి అజ్ఞానంతో, మూర్తీభవించిన మూర్ఖత్వంతో నిన్న మాట్లాడారు. విషాదం ఏంటంటే.. దేవాదుల ఏ బేసిన్‌లో ఉందని రేవంత్‌ రెడ్డి అడుగుతాడు. దేవాదుల ఏ బేసిన్‌లో ఉందో తెలియదు.. బనకచర్ల ఏ బేసిన్‌లో కడుతున్నారో ఆయనకు తెలియదు. అసలు సీఎం రేవంత్‌ ఏం చేస్తున్నట్లు.? బనకచర్ల విూద ఏపీ ఆరు నెలల నుంచి పని చేస్తూ.. కేంద్ర ఆర్థిక మంత్రికి ఉత్తరాలు రాస్తూ.. కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలుస్తూ ముందుకు పోతుంటే.. సీఎం అమాయకంగా బనకచర్ల ఏ బేసిన్‌లో ఉంది అని అడుగుతున్నాడు. దీని బట్టి తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రేవంత్‌ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమైపోతోంది అని హరీశ్‌రావు అన్నారు. ్గªళివంత్‌ రెడ్డి లాగా నేను విజ్ఞతను పొగొట్టుకునే వ్యక్తిని కాదు. రేవంత్‌ రెడ్డి కుసంస్కారి. సంస్కారం లేని వ్యక్తి. మాట్లాడితే సొల్లు.. ఎదుటి వారివిూద బురద జల్లడం, నోటికొచ్చినట్టు వదరుబోతు తనంతో మాట్లాడడం. మాకేమో కొన్ని ఎథిక్స్‌ ఉన్నాయి. క్యారెక్టర్‌తో ఉన్నాం. ఉద్యమాలు, పోరాటాల నుంచి వచ్చినోళ్లం.. నీలాగా అడ్డమైన తొక్కుళ్లు తొక్కుకుంటూ వచ్చినోళ్లం కాదు. ఈయనకు బేసిక్స్‌ తెలియవు.. బేసిన్స్‌ తెలియవు అని నేను ఉట్టిగా అనలేదు. దేవాదుల ఏ బేసిన్‌లో ఉందని సామాన్య రైతును అడిగినా, స్కూల్‌ పిల్లగాడిని అడిగినా.. గోదావరి విూద కట్టిండ్రు అని చెప్తరు. సీఎం రేవంత్‌కు దాని విూద జ్ఞానం లేకపోవడం శోచనీయం. రేవంత్‌ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏందంటే.. బూతులు తెలుసుకున్నంత సులువు కాదు.. బేసిన్ల గురించి తెలుసుకోవడం. బూతులు మాట్లాడినంత సులువు కాదు.. బేసిన్ల గురించి అర్థం చేసుకోవడం రేవంత్‌ రెడ్డి గారు. నీ చిల్లర రాజకీయాలతో నీ అజ్ఞానాన్ని బయట పెట్టుకుని రాష్ట్రం పరువు తీశావు అని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.