జలయజ్ఞం కాదు ధనయజ్ఞమే

మచ్చుకైనా కానరాని పారదర్శకత
ప్రాజెక్టులన్నీ లోపాల పుట్టలే..
ప్రభుత్వాన్ని తలంటిన కాగ్‌
హైదరాబాద్‌, జూన్‌ 21 (జనంసాక్షి) :
జలయజ్ఞం కాదు ధనయజ్ఞమేనని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్నింట్లోనూ పూర్తిగా పారదర్శకత లోపించిందని తూర్పారబట్టింది. జలయజ్ఞం, ఉపాధి హామీ పథకాల్లో లోపాలను ఎత్తి చూపింది. అసెంబ్లీ సమావేశాల చివరి రోజైన శుక్రవారం ప్రభుత్వం కాగ్‌ నివేదికను సభలో ప్రవేశపెట్టింది. జలయజ్ఞంలో అనేక లోపాలున్నాయని కాగ్‌ వెల్లడిరచింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన టెండర్లు, కాంట్రాక్టుల అప్పగింత ప్రక్రియలో పారదర్శకత లోపించిందని పేర్కొంది. కృష్ణా వరదల జలాలపై ఆధారపడి చేపట్టిన కొన్ని ప్రాజెక్టుల మనుగడ సాధ్యం కాకపోవచ్చని వెల్లడిరచింది. గాలేరి`నగరి, వెలిగొండ, శ్రీశైలం ఎడమ గట్టు కాలవు విషయంలో నీటి లభ్యత రుజువు చేయలేదని, దీనివల్ల కేంద్ర జలసంఘం ఆయన ప్రాజెక్టుల ప్రతిపాదనలను తిప్పిపంపిందని పేర్కొంది. 26 ప్రాజెక్టుల అమలుకు సంబంధించి నిర్దిష్ట పరిశీలనలను కాగ్‌ వెల్లడిరచింది. ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం కారణంగా నిర్మాణ వ్యయం రూ.52,116 కోట్ల మేర పెరిగిందని ప్రకటించింది. జలయజ్ఞం నిర్వహణలో ఈపీపీ తీరును కాగ్‌ తూర్పారబట్టింది. ప్రాజెక్టుల నిర్వాసితుల్లో 13 శాతం మందికి మాత్రమే ఇళ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపింది.
మరోవైపు, ఉపాధి హామీ పథకంలోనూ చోటు చేసుకున్న లోపాలన్‌ కాగ్‌ ఎత్తిచూపింది. ఉపాధి హామీ చట్టానికి సంబంధించిన అమలు రికార్డుల నిర్వహణ సరిగా లేదని వెల్లడిరచింది. ఉపాధి హావిూ పథకం వల్ల పల్లెల నుంచి పట్నాలకు వలసలు తగ్గాయని తెలిపింది. విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖలకు సరైన నిధుల కేటాయింపు లేదని పేర్కొంది. తరచుగా అగ్నిప్రమాదం జరిగే ప్రాంతాలను సర్కారు పాక్షికంగా గుర్తించిందని, అయితే, సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయలేదని మండిపడిరది. పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లను స్తంభింపజేయడం వల్ల 2008`12 మధ్య కేటాయించిన నిధుల్లో 24 శాతం మేర నిధులు దుర్వినియోగమైనట్లు తేలిందని కాగ్‌ తన నివేదికలో పేర్కొంది.