జల్ జంగల్ జమీన్ కోసం పోరాడిన అమరుడు కొమరం భీమ్
భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షులు పి కళావతమ్మ
వనపర్తి అక్టోబర్ 8 (జనం సాక్షి)”భూమి నీరు అడవి మాదే’నినాదంతో ఆదిలాబాద్ జిల్లాలో గోండుల పక్షాన నిజాం చట్టాలను ధిక్కరించి పోరాడిన గొప్ప గిరినోద్యమ యోధుడు కొమరం భీమ్ అని భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షులు సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పి. కళావతమ్మ,పట్టణ పార్టీ కార్యదర్శి రమేష్ కొనియాడారు.ఆయన పోరాట చరిత్ర ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు శనివారం వనపర్తి జిల్లా కేంద్రం సిపిఐ కార్యాలయంలో కొమరం భీం 82వ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు 1901 లో ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ తాలూకా సుంకేపల్లి లో జన్మించాడ న్నారు 1940 లో 39 ఏళ్ల వయసులో పోరాటంలోనే వీరమరణం చెందాడన్నారు ఓ కుట్ర దారు అందించిన సమాచారంతో జోడేఘాట్ లో సైనికులు చుట్టుముట్టి కాల్చి చంపారన్నారు.అటవీ శాఖ సిబ్బంది తండ్రిని చిన్నతనంలోనే చంపేశారు దాంతో కనిమేర వలస వెళ్లారు అక్కడ తమ భూమిని సిద్ధికీ అనే నిజాం మద్దతు దారు ఆక్రమిస్తే అతనిని చంపేసి అస్సాం పారిపోయాడున్నారు అన్యాయంపై తిరుగుబాటు ఆయన రక్తంలోనే ఉందన్నారు ఐదేళ్లకు కనిమేర తిరిగివచ్చి పశువుల కాపరులపై నిజాం విధించిన సుంకానికి వ్యతిరేకంగా నీరు అడవి భూమి పై మాదే హక్కు అని గిరిజనులను కూడగట్టి గిరిల్లా పోరాటం జరిపారన్నారు తెలంగాణ చరిత్రలో గొప్ప గిరిజోనోద్యమ నాయకుడు అన్నారు ఆయన గోండు బెబ్బులిగా పేరొందరన్నారు ఆ పోరాట స్ఫూర్తితో పోడు భూముల కోసం గిరిజన బందు కోసం పోరాడాలన్నారు ఆయన పోరాట స్ఫూర్తి నేటి ఉద్యమకారులకు ఆదర్శమన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నరేష్,సిపిఐ పట్టణ సహయ కార్యదర్శి ఎర్రకురుమన్న,రమణ ఏఐఎస్ఎఫ్ నాయకులు మనుసాగర్ భారత జాతీయ మహిళా సమాఖ్య పట్టణ ఉపాధ్యక్షులు జయ నాయకులు వెంకటమ్మ లావణ్య తదితరులు పాల్గొన్నారు.