జస్టిస్ ఘోష్ నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టొద్దు

` తెలంగాణ సర్కారుకు హైకోర్టు ఆదేశం
` కేసీఆర్,హరీశ్‌లకు భారీ ఊరట
` కమిషన్ నివేదికను నిలిపివేసిన ధర్మాసనం
హైదరాబాద్(జనంసాక్షి):కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ధర్మాసనం నిలిపివేసింది. జస్టిస్ ఘోష్ కమిషన్ చట్టబద్ధమేనని న్యాయస్థానం తెలిపింది. అయితే రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పిటిషనర్లు కేసీఆర్, హరీశ్ రావుతో పాటు స్మిత సబర్వాల్, ఎస్‌కే జోషికి ఊరట లభించిన్లటైంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందంటూ రాష్ట్ర ప్రభుత్వం 2024 మార్చిలో జీవో నంబర్ 6ను జారీ చేస్తూ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించింది. అయితే ఘోష్ కమిషన్‌ను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్, హరీశ్ రావు, స్మిత సబర్వాల్, ఎస్‌కే జోషి పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానంలో సుదీర్ఘంగా విచారణ జరిగింది. ఈ పిటిషన్లపై ఏప్రిల్ 8న వాదనలు ముగియగా తీర్పును హైకోర్టు ఈరోజుకు(ఏప్రిల్ 22) వాయిదా వేసింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 6ను సమర్థించిన హైకోర్టు.. జీవో నంబర్ 6ను ఆధారంగా ఏర్పాటైన కమిషన్ నివేదికను అసెంబ్లీలో చర్చ జరగకుండానే విÖడియా ముందుకు తీసుకురావడాన్ని న్యాయస్థానం తప్ప్పుబట్టింది. కమిషన్ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని పిటిషనర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. కాళేశ్వరంపై హైకోర్టు తీర్పుతో కేసీఆర్‌కు ఊరట లభించిందని మాజీ సీఎం అడ్వకేట్ గండ్రమోహన్ రావు తెలిపారు. హైకోర్టు తీర్పుతో కమిషన్ రిపోర్టును చెత్తలో పడేయవచ్చన్నారు. సెక్షన్ 8 కింద విచారణ జరగలేదని చెప్పారు. పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటును హైకోర్టు సమర్థించిందని తెలిపారు. అయితే కమిషన్ రిపోర్టును పరిగణనలోకి తీసుకుని సీబీఐ దర్యాప్తు చేయరాదని న్యాయస్థానం చెప్పిందని కేసీఆర్ అడ్వకేట్ గండ్రమోహన్ రావు వెల్లడించారు.

ఎన్ని కుట్రలు పన్నినా న్యాయమే గెలిచింది
హైకోర్టు తీర్పుపై మాజీమంత్రి హరీశ్
హైకోర్టు తీర్పుతో బుద్ది తెచ్చుకోవాలి
మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి హితవు
హైదరాబాద్(జనంసాక్షి):ఎవరెన్ని కుట్రలు చేసినా న్యాయస్థానాల్లో అంతిమంగా ధర్మం జయిస్తుందని, సత్యం నినదిస్తుందని ఈరోజు మరోసారి నిరూపితమైందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి పీసీ ఘోష్ నివేదికపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సోషల్ విÖడియా ఎక్స్ వేదికగా మాజీ మంత్రి స్పందించారు. ఘోష్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం స్పష్టం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కుట్రలు బట్టబయలు అయ్యాయని, రేవంత్ నిజస్వరూపం హైకోర్టు తీర్పుతో తేటతెల్లం అయ్యిందంటూ హరీశ్ పోస్ట్ చేశారు. ’సత్యమేవ జయతే.. ఎవరెన్ని కుట్రలు చేసినా న్యాయస్థానాల్లో అంతిమంగా ధర్మం జయిస్తుందని, సత్యం నినదిస్తుందని ఈరోజు మరోసారి నిరూపితమైంది. ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ నడిపిన విచారణను ఉన్నత న్యాయస్థానం తప్ప్పుబట్టింది. వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా కమిషన్ చేసిన వ్యాఖ్యలు చెల్లవని, ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదని స్పష్టంగా తీర్పునిచ్చింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కుట్రలు బట్టబయలయ్యాయి. ప్రజా సమస్యలు పక్కనపెట్టి డ్రామాలు ఆడిన రేవంత్ రెడ్డి నిజస్వరూపం హైకోర్టు తీర్పుతో తేటతెల్లం అయ్యింది. ఇప్పటికైనా కక్షసాధింపులు, రాజకీయ దుష్పచ్రారం మానేసి వెంటనే రెండు పిల్లర్ల మరమ్మతులు పూర్తి చేసి తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు ఔనన్నా కాదన్నా… ముమ్మాటికీ కాళేశ్వరం తెలంగాణకు ప్రాణెళిశ్వరం.. జై తెలంగాణ.. జై కేసీఆర’ అంటూ మాజీ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు.
హైకోర్టు తీర్పుతో బుద్ది తెచ్చుకోవాలి:మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై హైకోర్టు తీర్పును చూసైనా కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకోవాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ నడిపిన విచారణను ఉన్నత న్యాయస్థానం తప్ప్పుబట్టింది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ జీవధార కాళేశ్వరం విÖద నిందలు మోపి బీఆరఎస్ , కేసీఆర్ ప్రతిష్ట దెబ్బ తీసేందుకు కాంగ్రెస్, బీజేపీ వాడుకున్నాయని ఆరోపించారు. ప్రాజెక్ట్‌ను రెండున్నరేళ్లు మరమ్మతులు చేపట్టకుండా అడ్డుకున్నారు. చివరకు గత్యంతరం లేక మరమ్మతులు చేపడుతున్నారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ విÖద చేసిన ఆరోపణలకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణ ప్రజలకు, రైతాంగానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పుపై ఆయన హర్షణీయం వ్యక్తం చేశారు.

 

హైకోర్టు తీర్పు కాంగ్రెస్‌కు చెంపపెట్టు
` పీసీ ఘోష్ కమిషన్ కాదు.. ముమ్మాటికీ పీసీసీ నివేదిక
` రాజకీయ కుట్రలు పక్కన పెట్టి రైతన్నల కోసం పనిచేయండి
` హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్
హైదరాబాద్(జనంసాక్షి): కూలింది.. కాళేశ్వరం కాదని, కాంగ్రెస్ చేసిన కుట్రలని బీఆరఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపై బుధవారం హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆరఎస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ తెలంగాణ భవన్‌లో విÖడియాతో మాట్లాడారు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కుట్రలకు చెంపపెట్టు అని కేటీఆర్ అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ రాజకీయ కుట్రలు పక్కన పెట్టి రైతన్నల కోసం పని చేయాలని హితవు పలికారు. అది పీసీ ఘోష్ కమిషన్ కాదు, ముమ్మాటికీ పీసీసీ నివేదిక అని మేము
ముందు నుంచి చెబుతుంది ఇవాళ అక్షరాల నిజమని తేలిపోయిందన్నారు.. కేసీఆర్‌పై దుష్పచారం చేసిన వారి చెంప చెళ్లుమనించే విధంగా హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. ఇవాళ గెలిచింది.. తెలంగాణ ప్రజలు, రైతులు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కషి చేసిన ఇంజినీర్లు. మూడేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై దుష్పచారం చేసింది. ఇవాళ తెలంగాణలో పారుతున్న ప్రతినీటి బొట్టు కేసీఆర్ కషే. భూమిపై గోదావరి పారినన్ని రోజులూ కేసీఆర్ చరిత్రను ఎవరూ చెరిపివేయలేరు. అది పీసీ ఘోష్ కమిషన్ కాదు, పీసీసీ నివేదిక అని నేను అప్ప్పుడే చెప్పాను. హైకోర్టు తీర్పుతో అందరికీ ఇవాళ జ్ఞానోదయం కలిగి ఉంటుంది. కాళేశ్వరం కచ్చితంగా తెలంగాణకు వరప్రదాయని. రూ.94వేల కోట్లు ఖర్చు అయితే.. రూ.లక్ష కోట్లు అని దుష్పచారం చేశారు. కాళేశ్వరం అంటే ఒక్క బ్యారేజీ కాదు.. మూడు బ్యారేజీలు. మేడిగడ్డపై చేసిన ఖర్చు రూ.3,800 కోట్లు మాత్రమే. కాంగ్రెస్ కుట్రల వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని మరోసారి చెబుతున్నా. రాష్ట్రంలో చెక్‌డ్యామ్‌లను బాంబులు పెట్టి పేలుస్తున్నారు. ఈ విషయంలో కేంద్రం ఏం చేస్తోంది? మేడిగడ్డలో ఏం జరిగిందో విశ్రాంత జడ్జితో మళ్లీ విచారణ జరిపించాలని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షగట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టు తీర్పు ఒక గట్టి ’చెంపపెట్టు’ అని కేటీఆర్ అభివర్ణించారు. భారత రాజ్యాంగానికి, చట్టాలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా దేశంలోని గౌరవ న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవని ఈ తీర్పుతో మరోసారి రుజువైందని కేటీఆర్ పేర్కొన్నారు. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ కుట్రలకు బ్రేక్ పడినట్లయిందని కేటీఆర్ స్పష్టం చేశారు. కమిషన్ విచారణలో సహజ న్యాయ సూత్రాలను పూర్తిగా విస్మరించడమే కాకుండా, నిబంధనలకు పాతరేశారని బీఆరఎస్ అధినేత కేసీఆర్ గతంలోనే స్పష్టం చేశారని, ఆ విషయాలతో ఇవాళ హైకోర్టు కూడా ఏకీభవించడం హర్షణీయమని ఆయన తెలిపారు. రాజకీయ కక్ష సాధింపు కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న తీరును ఈ తీర్పు ఎండగట్టిందని ఆయన అభిప్రాయపడ్డారు. రెండున్నరేళ్లుగా కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ముక్కు నేలకు రాసి, రాష్ట్రంలోని అన్నదాతలకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మేడిగడ్డ బ్యారేజీలో స్వల్పంగా దెబ్బతిన్న రెండు పిల్లర్లను రిపేర్ చేసి, రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల సాగునీటి కష్టాలు తీర్చాలని సూచించారు. రాజకీయ క్రీడ కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమని కేటీఆర్ హితవు పలికారు.గోదావరి జలాలను పక్కరాష్టాన్రికి దోచిపెట్టి, తెలంగాణలో వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టే కుతంత్రాలను ఇంకా కొనసాగించాలని చూస్తే రేవంత్ సర్కారుకు రైతుల చేతిలోవాతలు తప్పవని కేటీఆర్ హెచ్చరించారు. ప్రాజెక్టుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ, రైతుల పొలాలకు నీరు అందకుండా చేస్తున్న ప్రభుత్వ వైఖరిని బీఆరఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని, రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

 

కాళేశ్వరం అవినీతి విచారణలో సర్కార్ విఫలం
` ప్రభుత్వ వైఫల్యాన్ని బయటపెట్టిన హైకోర్టు తీర్పు
` అవకతవకలపై ఇన్నేళ్లయినా చర్యలు లేవు:కిషన్ రెడ్డి
హైదరాబాద్(జనంసాక్షి): కాళేశ్వరం అవినీతి విచారణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలమైందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం అవకతవకలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించి బుధవారం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని మరోసారి బట్టబయలు చేసిందని పేర్కొన్నారు. ఈ మేరకు కిషన్‌రెడ్డి ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ.. వాటిని చట్టపరంగా సమర్థవంతంగా కోర్టు ముందు ప్రవేశపెట్టడంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. చట్టపరమైన ప్రమాణాలకు అనుగుణంగా తగిన ఆధారాలను సమర్పించలేకపోవడం వల్ల, కమిషన్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యల విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వ నిర్లక్ష్యానికి, అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. కాంగ్రెస్ మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదని మరోసారి నిరూపితమైందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని కిషన్‌రెడ్డి విమర్శించారు. అధికారంలోకి రాగానే.. కేసీఆర్, వారి కుటుంబ సభ్యులు, మంత్రులు, బీఆరఎస్ ఎమ్మెల్యేలు చేసిన అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్, రేవంత్‌రెడ్డి పెద్ద పెద్ద హావిÖలు ఇచ్చారని ప్రస్తావించారు. కానీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తికావొస్తున్నా.. ఏ ఒక్క అవినీతి, అవకతవకలపై సమగ్ర దర్యాప్తు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సీఎం అన్నారని చెప్పారు.. అలాగే, ఫార్ములా వన్ రేస్ పేరు విÖద చేసిన ఖర్చులు, డ్రగ్స్ కేసు, భూ ఆక్రమణలు, భూ కేటాయింపులు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని.. అవినీతి సొమ్మును కక్కిస్తానని పదే పదే రేవంత్‌రెడ్డి ప్రకటించినప్పటికీ వాటిపై ఒక్కటంటే ఒక్క చర్య కూడా ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై.. రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకోకపోవడానికి కారణం.. ఈ రెండు పార్టీల మధ్య ఉన్న దోస్తీయేనని విమర్శించారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్, బీఆరఎస్ పార్టీలు ’డూప్ ్గªటింగ’ చేస్తూ.. ’నేను గిచ్చినట్లు చేస్తా, నువ్వు ఏడ్చినట్లు చేయి’ అన్నట్లుగా వ్యవహారిస్తున్నాయని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలను రెండు పార్టీలు మోసం చేస్తున్నాయని ఆగ్రహించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ అవినీతి పాలన నుంచి విముక్తి కోసం.. మార్పు కావాలని కాంగ్రెస్‌కు ఓటేశారని తెలిపారు. కానీ రేవంత్ సర్కార్.. హావిÖలను మాటలకే పరిమితం చేస్తూ.. అవినీతికి పాల్పడిన వారిని ఎందుకు వదిలేస్తున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. గత రెండున్నరేళ్లుగా రాష్టాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ సర్కార్ అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ.. తెలంగాణ ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచుకుంటోందని ఆరోపించారు. అందుకనే బీఆరఎస్ హయాంలో జరిగిన అక్రమాలపై చర్యలకు కాంగ్రెస్ సర్కార్ వెనుకాడుతోందని విమర్శించారు. ఇది రేవంత్‌రెడ్డి పరిపాలనా వైఫల్యమని, ఇచ్చిన హావిÖలను విస్మరించి తెలంగాణ ప్రజలకు చేస్తున్న రాజకీయ ద్రోహమని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత, అసెంబ్లీలో, బయట ప్రజలకు ఇచ్చిన హావిÖల ప్రకారం వెంటనే.. అవినీతి కేసుల్లో చట్టబద్ధమైన, పారదర్శకమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈరోజు హైకోర్టు తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. ఎన్నికల హావిÖలు ఎందుకు అమలు కాలేదు..? అని ప్రశ్నించారు. అవినీతి కేసుల్లో చర్యలు ఎందుకు ఆలస్యమవుతున్నాయి..? అని నిలదీశారు. దొంగలు, దొంగలు కలిసి తెలంగాణను దోచుకోవడంలో పోటీపడుతూ.. రాష్టాన్నినాశనం చేయాలని అనుకుంటున్నారా..? అని కిషన్‌రెడ్డి సెటైర్లు గుప్పించారు.

2. కాళేశ్వరంపై ఎవరికీ క్లీన్‌చిట్ ఇవ్వలేదు
` హైకోర్టు తీర్పుపై సీఎంతో ఉత్తమ్ చర్చలు
` తదుపరి కార్యాచరణపై ఇరు నేతల సమాలోచనలు
హైదరాబాద్(జనంసాక్షి):కాళేశ్వరం ప్రాజెక్టులో తెలంగాణ హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటు సరైందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసిందని తెలిపారు. సీబీఐకి ఘోష్ కమిషన్ పంపిన రిపోర్టుల్లో ఎవరి పేర్లను మెన్షన్ చేయలేదని చెప్ప్పుకొచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డితో మంత్రి ఉత్తమ్ బుధవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్, హైకోర్ట్ తీర్పుపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ విÖడియాతో చిట్ చాట్ చేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 6ను కొట్టివేయాలని పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారని… కానీ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటును హైకోర్టు తప్ప్పుపట్టలేదని స్పష్టం చేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నియామకాన్ని పూర్తిగా సమర్థించిందని తెలిపారు. కమిషన్ ఫైండింగ్స్‌ను కూడా హైకోర్టు తప్ప్పుపట్టలేదని చెప్ప్పుకొచ్చారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం 1952లోని సెక్షన్ 3 ప్రకారం జీవో ఎంఎస్ నంబర్ `6 ద్వారా ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ రాజ్యాంగబద్ధమేనని న్యాయస్థానం స్పష్టం చేసిందని పేర్కొన్నారు. కమిషన్ ఏర్పాటు అధికార పరిధిని మించింది కాదని.. అసమంజసం కాదని, అక్రమం కాదని కూడా న్యాయస్థానం స్పష్టం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జ్యుడిషియల్ కమిషన్ విచారణ నివేదికలో కొందరు బాధ్యులపై చేసిన నిర్దారణలపై హైకోర్టు అభ్యంతరం తెలిపిందని చెప్పారు. పిటిషనర్లకు నిర్ణీత ఫార్మాట్ ప్రకారం నోటీసు ఇవ్వలేదనే టెక్నికల్ అంశాన్ని తప్ప్పుపట్టిందన్నారు. జ్యుడిషియల్ కమిషన్ విచారణ నివేదిక ఆధారంగా వారిపై చర్యలు తీసుకోవద్దని పిటిషనర్లకు రిలీఫ్ ఇచ్చిందని చెప్పారు. ఇప్పటికే తమ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లోపాలు, అవకతవకలపై సీబీఐతో విచారణ చేపట్టాలని నిర్ణయించిందని అన్నారు. సీబీఐకు లేఖ రాశామని ప్రస్తావించారు. ఈ రోజు వెలువడిన హైకోర్టు తీర్పు సీబీఐ విచారణకు అడ్డంకి కాదని.. న్యాయస్థానం ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. హైకోర్టు పూర్తి తీర్పును పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని ముమ్మాటికీ నిజమన్నారు. ప్రాజెక్టుకు ఎంచుకున్న సైట్ నుంచి డిజైన్ల నుంచి నిర్మాణాలు, నిర్వహణ అన్నిచోట్ల అవకతవకలు జరిగాయని.. అన్నీ లోపాలే ఉన్నాయని.. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వారికి నోటీసులు ఇవ్వలేదనే కారణంగా, వాళ్లపై కమిషన్ చేసిన రిమార్క్స్ మాత్రమే ఇన్ ఆపరేటివ్‌గా ఉంటాయని హైకోర్టు తెలిపిందని అన్నారు. ఇది పూర్తిగా ప్రొసిజరల్, టెక్నికల్ అంశమని చెప్ప్పుకొచ్చారు. కాళేశ్వరం ప్రజల కళ్లముందే కుంగిపోయిందని.. 2023 అక్టోబర్ 21వ తేదీన మేడిగడ్డ బ్యారేజీలో ఏడో బ్లాక్ కుంగిపోయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆ బ్యారేజీ దగ్గరికు వెళ్తే ఎవరికైనా కుంగిన తీరు కనపడుతుందన్నారు. లక్ష కోట్లతో కట్టిన బ్యారేజీ మూడేళ్లకే కుంగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆరఎస్ హయాంలో కట్టిన ప్రాజెక్టు వాళ్ల హయంలోనే కుంగిపోయిందని అన్నారు. అందుకు కారణాలేమిటో తేల్చాల్చిన బాధ్యత.. తమ ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. కేందప్రభుత్వం ఆధ్వర్యంలోని నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ కూడా బ్యారేజీల కుంగుబాటుకు దారి తీసిన కారణాలు, డిజైన్ల, నిర్మాణం, నిర్వహణ లోపాలపై తమ ప్రాథమిక నివేదికను బీఆరఎస్ హయాంలోనే సమర్పించిందని అన్నారు. బ్యారేజీలకు ఎంచుకున్న ప్రాజెక్టు సైట్ నుంచి డిజైన్లు, నిర్మాణంలో జరిగిన లోపాలన్నింటినీ తమ ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ కమిషన్ బయటపెట్టిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోపాలు, అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన రిటైర్డ్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కూడా ఇంజనీర్లను, ఐఏఎస్‌లను, అప్పటి పరిపాలనా బాధ్యులను విచారించి నివేదికను వెల్లడించిందని తెలిపారు. బాధ్యులెవరు, దోషులెవరు.. ఎక్కడెక్కడ తప్ప్పులు జరిగాయో తేలుస్తామని చెప్పారు. ఏమేం లోపాలున్నాయో.. ఎన్డీఎసఏతో పాటు విజిలెన్స్, పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలపై ఆగస్టులోనే తమ ప్రభుత్వం అసెంబ్లీలో చర్చకు పెట్టిందని ప్రస్తావించారు. విజిలెన్స్, ఎన్డీఎసఏ, జస్డిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికల ఆధారంగా దర్యాప్తు జరపాలని సీబీఐ విచారణకు ప్రభుత్వం లేఖ రాసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గత ఏడాది సెప్టెంబర్ 1వ తేదీన తమ ప్రభుత్వం ఈ దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ జీవోతో పాటు నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. హైకోర్టు తీర్పుతో సీబీఐ విచారణకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. తీర్పు కాపీ వచ్చాక ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. రెండేళ్లుగా ఆ ప్రాజెక్టు నుంచి చుక్క నీరు అందలేదని చెప్ప్పుకొచ్చారు. ప్రతి ఏడాది ఈ ప్రాజెక్టు పేరిట ప్రభుత్వం రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వరకు అప్ప్పులు, వడ్డీలు భరిస్తుందని అన్నారు. కేవలం రెండు ఫిల్లర్లు కాదని.. మొత్తం పౌండేషన్.. మొత్తం మూడు బ్యారేజీల పునాదులు అనుమానాస్పదంగా ఉన్నాయని.. ఇప్పటికే దేశంలో పేరొందిన సంస్థల నిపుణులందరూ అభిప్రాయపడ్డారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా మానవ తప్పిదమని చెప్ప్పుకొచ్చారు. దేశంలోనే ఇది అతి పెద్ద విధ్వంసమన్నారు. అమూల్యమైన ప్రజాధనం వథా అయిందని.. దీనికి బాధ్యులెవరో ప్రజల ముందు నిలబెట్టాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

కాళేశ్వరం కథ ముగియలేదు
సీబీఐ విచారణకు తీర్పు అడ్డంకి కాదు
మండిపడ్డ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
కాళేశ్వరం అవినీతి జగమెరిగిన సత్యం
అన్ని నివేదికలు ఇదే చెప్పాయి
హైకోర్టు తీర్పుపై కోదండరామ్ వ్యాఖ్య
హైదరాబాద్(జనంసాక్షి): కాళేశ్వరంపై తెలంగాణ హైకోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదని.. బీఆరఎస్ నేతలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. హైకోర్టు తీర్పు సీబీఐ విచారణకు అడ్డంకి కాదన్నారు. హైకోర్టు తీర్పును పూర్తిగా అధ్యయనం చేశాక భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. బుధవారం విÖడియాతో మాట్లాడుతూ.. పలువురికి నోటీసులు ఇవ్వలేదని మాత్రమే హైకోర్టు చెప్పిందని వివరించారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను హైకోర్టు తప్ప్పుబట్టలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ కమిషన్ విచారణ చేసి ఇచ్చిన నివేదికను కూడా హైకోర్టు తప్ప్పుపట్టలేదన్నారు. లక్ష కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్ట్ కూలిపోయిందని.. లక్ష కోట్లు వథా చేశారని టీపీసీసీ చీఫ్ మండిపడ్డారు. కవిÖషన్ల కక్కుర్తి వల్లే కాళేశ్వరం కూలిందని ఆరోపించారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, ఏటీఎంలా మారిందని అమిత్ షా, నడ్డా చేసిన వ్యాఖ్యలు వాస్తవం కాదా కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. హైకోర్టు చెప్పిన కొన్ని అంశాలను చూసి సంబరాలు చేసుకుంటున్నారని బీఆరఎస్‌పై మహేశ్ గౌడ్ మండిపడ్డారు. పీసీ గోష్ రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న ఎన్‌డీఎసఏ కూడా రిపోర్ట్ ఇచ్చిందన్నారు. కాళేశ్వరంలో నిర్మాణ లోపాలు ఉన్నాయని ఎన్‌డీఎసఏ చెప్పిందని తెలిపారు. హైకోర్టు ఎక్కడా కూడా బీఆరఎస్ అవినీతికి పాల్పడలేదని చెప్పలేదన్నారు. బీఆరఎస్ హయాంలో కట్టిన ప్రాజెక్ట్ వారి హయాంలోనే కూలిందన్నారు. ఆలస్యమైనా దోషులు జైలుకు వెళ్లక తప్పదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
అన్ని నివేదికలు ఇదే చెప్పాయి:కోదండరామ్
కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై టీజేఏసీ అధ్యక్షులు కోదండరాం స్పందించారు. హైకోర్టు తీర్పుపై బీఆరఎస్ నేతలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి జరిగిందని, లోపాలు ఉన్నాయని కాగ్, విజిలెన్స్, ఎన్‌డీఎసఏ రిపోర్ట్‌లు ఇచ్చాయని తెలిపారు. ఈ నివేదికల ఆధారంగా కూడా చర్యలు తీసుకోవచ్చన్నారు. విచారణ చేయకపోతే సీబీఐదే తప్పవుతుందని టీజేఏసీ అధ్యక్షులు చెప్ప్పుకొచ్చారు. కాళేశ్వరంలో తప్ప్పు జరిగిందని తెలుస్తున్నప్ప్పుడు చర్యలు తీసుకోడానికి ఇబ్బంది ఏంటని కోదండరాం ప్రశ్నించారు. ’బ్యారేజ్ నిర్మాణంలో పిల్లర్లు కుంగిపోయినవి మనకు కనిపిస్తుంది కదా… ఇంకేం కావాలి’ అని అన్నారు. కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు ఎవరకీ చెంపపెట్టు కాదని కోదండరాం స్పష్టం చేశారు.

సుప్రీం ఓటుకు నోటు కేసు విచారణ..
రెండు వారాలకు వాయిదా
న్యూఢిల్లీ(జనంసాక్షి): ఓటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. జస్టిస్ జేకే మహేశ్వరి నేతత్వంలోని ప్రత్యేక ధర్మాసనం ఈ కేసును మరో రెండు వారాల తర్వాత విచారిస్తామని తెలిపింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ విజయ్ బిష్ణోయ్ కూడా సభ్యుడిగా ఉన్నారు. మంగళవారం ఈ కేసు విచారణ జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో రెండు కీలక పిటిషన్లు విచారణకు వచ్చాయి. ఒకటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కాగా, మరొకటి మాజీ ఎమ్మెల్యే, బీఆరఎస్ కీలక నేత సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసినది. సీఎం రేవంత్ రెడ్డి తన పిటిషన్‌లో ఓటుకు నోటు కేసును అవినీతి నిరోధక చట్టం కింద కాకుండా ఎన్నికల చట్టాల ప్రకారమే విచారించాలని కోరారు. ఈ కేసును క్రిమినల్ అవినీతి కేసుగా కాకుండా ఎన్నికల ఉల్లంఘనగా పరిగణించాలని ఆయన వాదించారు. మరోవైపు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తనపై నమోదైన ఈ కేసులో తన పేరును పూర్తిగా తొలగించాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. తనపై ఉన్న ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని ఆయన వాదించారు. ఈ రెండు పిటిషన్లను కలిపి విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. దీంతో ఈ కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఓటుకు నోటు కేసు గతంలో కూడా తెలంగాణ, ఆంధప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సష్టించిన విషయం తెలిసిందే. ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా పడినప్పటికీ, ఈ కేసు ప్రాధాన్యం మాత్రం తగ్గలేదు. వచ్చే విచారణలో కోర్టు తీసుకునే నిర్ణయాలు రాజకీయంగా కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, నైతిక విలువలపై ఈ కేసు కీలకంగా నిలుస్తోంది.