జాట్‌ల ఆందోళన హింసాత్మకం

1

చండీగఢ్‌,ఫిబ్రవరి 19(జనంసాక్షి): రిజర్వేషన్ల కోసం హర్యానాలో జాట్‌ ల సామాజిక వర్గానికి చెందిన వారు చేస్తున్న ఆందోళన శుక్రవారం హింసాత్మకంగా మారింది. రొహతక్‌ ప్రాంతం సవిూపంలో ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. 9 మంది గాయపడ్డారు. పోలీసు జీపుకు, మరో రెండు వాహనాలను తగులబెట్టారు. రొహతక్‌ లో మంత్రి నివాసంపై ఆందోళనకారులు దాడి చేసి వాహనాలకు నిప్పు పెట్టారు. రొహతక్‌-ఢిల్లీ రహదారిని దిగ్బంధించారు. జాట్‌ ల ఆందోళనతో రొహతక్‌ జిల్లాలో మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. జాట్‌ ల ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో అఖిలపక్ష నేతలతో ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రొహతక్‌ జిల్లాలో జనజీవనం స్తంభించింది. నిత్యవసర వస్తువులు దొరక్కా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు పాఠశాలలు సెలవు ప్రకటించాయి.