జాట్‌ ఆందోళన ఉగ్రరూపం

5

– స్థంభించిన జనజీవనం

– దిగివచ్చిన సర్కారు

ఢిల్లీ,ఫిబ్రవరి 21(జనంసాక్షి):హర్యానాలో జాట్‌ ల ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. హర్యానాలోని తొమ్మిది జిల్లాల్లో పరిస్థితి అదుపు తప్పింది. దాంతో అక్కడ కర్ఫ్యూ విధించారు. హర్యానాతో పాటూ ఢిల్లీ, బీహార్‌ లలో కూడా జాట్‌ లు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీకి ప్రధాన నీటి వనరు అయిన మునక్‌ కెనాల్‌ దగ్గర ఆందోళనకారులు నీటి పంపిణీని అడ్డుకోవడంతో ఢిల్లీకి నీటి కొరత ఏర్పడింది. దాంతో రేపు అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించింది ఢిల్లీ ప్రభుత్వం. రేపు జరగాల్సిన అన్ని పరీక్షలను రద్దు చేసింది. అటు హర్యానా-ఢిల్లీ జాతీయ రహదారిపై జాట్‌ లు రాస్తారోకో చేస్తుండటంతో వేలాది వాహనాలు నిలిచిపోయాయి. ముందస్తు చర్యగా మిగిలిన సరిహద్దు ప్రాంతాల్లో పారామిలటరీ బలగాలను దింపారు. అటు జాట్‌ నిరసనల్లో ఇప్పటి దాకా 10 మంది మరణించగా, 150 మందికి పైగా గాయపడ్డారు.

జాట్‌ల రిజర్వేషన్లపై దిగొచ్చిన సర్కార్‌!

జాట్‌ల రిజర్వేషన్‌ విషయంలో సర్కార్‌ ఎట్టకేలకు దిగొచ్చినట్లు తెలుస్తోంది. రానున్న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో జాట్‌లకు రిజర్వేషన్‌ కల్పించే అంశంపై బిల్లు ప్రవేశపె

ట్టడానికి హర్యానా ప్రభుత్వం అంగీకరిస్తూ నిర్ణయం తీసుకుందని, జాట్‌ నాయకులతో కేంద్ర ¬ం మంత్రి రాజనాథ్‌ సింగ్‌  సమావేశం ముగిసిన అనంతరం దీనిపై

ప్రకటన చేయనున్నట్లు మంత్రి ఓపీ ధన్‌కర్‌ ఆదివారం తెలిపారు. ఎనిమిది రోజులుగా జాట్లు నిర్వహిస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారడంతో మృతుల సంఖ్య 12 కు చేరింది.

ఉద్యమం రాజస్థాన్‌తో పాటు ఇతర రాష్ట్రాలలో సైతం ఉద్రిక్తతలకు దారి తీస్తున్న నేపథ్యంలో కేంద్ర ¬ం మంత్రి రాజనాథ్‌ సింగ్‌ ఆదివారం హర్యానా మంత్రి ధన్‌కర్‌, ఢిల్లీ

పోలీస్‌ చీఫ్‌ బీఎస్‌ బస్సీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, ఆర్మీ చీఫ్‌ దల్బీర్‌ సింగ్‌తో సవిూక్ష నిర్వహించారు. కేంద్ర ¬ం మంత్రి రాజనాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ..

జాట్‌ ల రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు నేతృత్వంలో కమిటీ వేస్తున్నట్లు తెలిపిన ఆయన జాట్‌ లను ఆందోళన విరమించాల్సిందిగా కోరారు.

జాట్‌ల సమస్య పరిష్కారానికి వెంకయ్య నేతృత్వంలో కమిటీ

తమ రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న జాట్‌ల సమస్య పరిష్కారం కోసం కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. జాట్‌ రిజర్వేషన్ల అంశంపై ఈ కమిటీ సవిూక్షించి కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. హర్యానాలోని జాట్‌లు ఉద్యమాన్ని తీవ్రతరం చేయడంతో కేంద్రప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

జాట్‌ల ఆందోళనలతో పలు రైళ్లు రద్దు చేసిన ద.మ.రైల్వే

హరియాణాలో జాట్‌ల ఆందోళనలతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. హైదరాబాద్‌-హజరత్‌ నిజాముద్దీన్‌ దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌, హైదరాబాద్‌-దిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌, తిరుపతి-హజరత్‌ నిజాముద్దీన్‌ ఏపీ సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌, విశాఖ-ఖాజీపేట హజరత్‌ నిజాముద్దీన్‌ లింక్‌ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు ద.మ రైల్వే అధికారులు వెల్లడించారు. మరోవైపు జాట్‌ల ఆందోళన కారణంగా ఏపీ ఎక్స్‌ప్రెస్‌, మిలీనియం ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను వరంగల్‌ స్టేషన్‌లో నిలిపివేశారు.

జాట్ల ఆందోళనలతో రూ. 20 వేల కోట్ల నష్టం

ఓబీసీ రిజర్వేషన్ల కోసం జాట్‌ లు చేస్తున్న ఆందోళనలతో హర్యానాపై ఆర్ధికంగా పెద్ద దెబ్బ పడింది. జాట్‌ ల నిరసనలతో హర్యానాకు 20వేల కోట్ల నష్టం సంభవించినట్లు అసోచామ్‌ పేర్కొంది. గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న నిరసనల కారణంగా రైల్వే శాఖకు మూడు వందల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. జాట్‌ ల నిరసనల కారణంగా కేవలం హర్యానా మాత్రమే కాదు దాని సరిహద్దు రాష్ట్రాలు కూడా ఆర్ధికంగా నష్టపోయినట్లు అసోచామ్‌ తెలిపింది. నిరసనల ప్రభావంతో ఢిల్లీలో నీటి కొరత ఏర్పడింది. జాట్‌ రిజర్వేషన్ల కోసం జరుగుతున్న నిరసనలతో హర్యానాలో నాలుగు రోజులుగా వ్యాపారాలు ఎక్కడిక్కడే నిలిచిపోవడం, రవాణా వ్యవస్థ స్తంభించడంతో పాటూ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు కూడా భారీగా ధ్వంసం చేశారు. ఈ ఆందోళనలతో రైల్వేకు భారీ నష్టం వాటిల్లింది. గత మూడు రోజులుగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో 800లకు పైగా రైళ్లను రద్దు చేయాల్సి వచ్చింది. ఏడు రైల్వే స్టేషన్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. దాంతో రైల్వే శాఖకు మూడు వందల కోట్లకు పైగా నష్టం వచ్చినట్లు అధికారులు చెప్పారు. ఫిబ్రవరి 15 నుంచి ఆందోళనల ప్రభావంతో ప్రతి రోజు ప్యాసింజర్‌ రైళ్లతో పాటూ గూడ్స్‌ ట్రైన్లు కూడా రద్దు చేస్తున్నారు. దాంతో సరుకు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఆందోళనల్లో భాగంగా జాట్‌ లు జాతీయ రహదారులపైకి రావడంతో హైవేలపై భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. దేశ రాజధానికి వెళ్లాల్సిన సరుకులు, హర్యానా-ఢిల్లీ హైవే విూదుగానే అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. కానీ, నిరసనకారులు వాటిని అడ్డుకోవడంతో ఢిల్లీ వాసులకు నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడింది. దాంతో కొన్ని చోట్ల వ్యాపారులు ధరలు పెంచి నిత్యావసరాలను అమ్ముతున్నారు. జాట్‌ ల ఆందోళనల ప్రభావం ఢిల్లీతో పాటూ హర్యానా సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్‌, రాజస్థాన్‌, యూపీలపై కూడా పడింది. ఆయా రాష్ట్రాలు కూడా ఆర్ధికంగా నష్టపోయినట్లు అసోచామ్‌ వెల్లడించింది. అటు జాట్‌ నిరసనల ఎఫెక్ట్‌ తో చంఢీఘడ్‌ నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు విమాన చార్జీలు పదింతలు పెరిగాయి. హైవేలు ట్రాఫిక్‌ తో నిండిపోవడంతో చాలా మంది విమానాలను ఆశ్రయిస్తున్నారు.

కేంద్ర ¬ంమంత్రితో జాట్‌ నేతల భేటీ

కేంద్ర ¬ం మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ తో హర్యానాకు చెందిన జాట్‌ నేతల సమావేశం ముగిసింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జాట్‌ రిజర్వేషన్లపై చట్టం చేసేందుకు హర్యానా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు పలువురు జాట్‌ నేతలు తెలిపారు. జాట్‌ రిజర్వేషన్లపై ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని కూడా ఈ సమావేశంలో హావిూ వచ్చినట్లు తెలిపారు. అయితే, జాట్‌ ల ఆందోళనలు విరమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు. పలుచోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి.