జాతరను తలపించేలా పోచారం భాస్కర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

 

కేజీబీవీ కస్తూరిబా గాంధి బాలికల పాఠశాలలో వినూత్నంగా పుట్టినరోజు వేడుకలను నిర్వహించిన మహిళా నాయకులు

రుద్రూర్(జనంసాక్షి):
మహిళల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్న తమ అభిమాన నాయకుడు ఉమ్మడి జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఎంపీపీ అక్కపల్లి సుజాత నాగేందర్ మరియు కేజీబీవీ కస్తూరిబా గాంధి బాలికల పాఠశాల యెస్ఓ శ్యామల ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థుల సమక్షంలో వినూత్నంగా నిర్వహించారు. నాయకుని రాకకు మునుపే కేజీబీవీ కస్తూరిబా గాంధి బాలికల పాఠశాలను వివిధ రకాల పువ్వులతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేల ఆహ్వానం తెలుపుతూ అలంకరించారు. అనంతరం సరస్వతి దేవి ఫోటో కు పూజలు నిర్వహించి, విద్యార్థులతో కేక్ కటింగ్ చేయించి శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛాలు తో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పాఠశాల విద్యార్థినిలు ఆయన చిత్రపటం ఉన్నా బహుమానాన్ని ఆయనకు అందించారు ఈ కార్యక్రమంలో కేవలం మహిళలని అనుమతించి వినూత్నంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అక్కపల్లి సుజాత నాగేందర్ మరియు కేజీబీవీ కస్తూరిబా గాంధి బాలికల పాఠశాల యెస్ఓ శ్యామల , ఎంపిటిసి పత్తి సావిత్రి,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు