జాతీయ ద్రవ్యోల్భణం మరియు నిరుద్యోగ నిర్ముల ఉద్యమం.

వెల్ఫేర్ పార్టీ అఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు
సయ్యద్ కమల్ అక్తర్.
తాండూరు అక్టోబర్ 21(జనంసాక్షి)జాతీయ ద్రవ్యోల్భణం మరియు నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని దేశం,రాష్ట్రంలో ప్రజల ఆకలి,నిరోద్యోగం, దారిద్ర్యంతో తీవ్రమైన సమస్యలతో బాధపడుతున్నారని
వెల్ఫేర్ పార్టీ అఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు
సయ్యద్ కమల్ అక్తర్ పేర్కొన్నారు. శుక్రవారం
విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ యువత ఉపాది లేక,మానసిక సమస్యలు,తీవ్ర వత్తిడికిలోనై తనువు చాలిస్తున్నారని తెలిపారు. పెట్రోల్, డీజిల్ మరియు వంట గ్యాస్  ధరలు విపరీతంగా పెరుగడం తో ప్రజల బ్రతుకు దుర్భారమయిందన్నారు. ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రధానమంత్రి మోడీ యువత కు మొండి చేయి చూపారు. పెట్రోల్, డీజిల్ మరియు వంట గ్యాస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జి యస్ టి పెంచడం వలన నిత్యావసర సరకుల ధరలు పెరిగి ప్రజలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ధరలు పెరుగడంతో దినసరి కూలీలు,రోజువారి దుర్భరజీవితం గడపుతున్నారు. , పెట్రోల్, డీజిల్ మరియు వంట గ్యాస్  పూర్తిగా జి యస్ టి తొలగించండి,దారిద్య రేఖకు దిగువ ఉన్నవారికి ఉచిత నిత్యావసర వస్తువులు అందించాలని
డిమాండ్ చేశారు. దినసరి కూలీల వేతనం రు.500 గ్రామిన ప్రాంతాలలో రు. 200కు పెంచాలి. బి ఫై యల్ కుటుంబాలకు ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన క్రింద ఉచితం గా గ్యాస్ అందించాలి.నిరుద్యోగ యువతకు కుల మతాలకు అతీతంగా  నిరోద్యోగా బృతి అందించాలి,లోన్ సౌకర్యం కల్పించి ఉపాది కల్పించాలి, ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కుకు చట్టబంద్దట కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
Attachments area

తాజావార్తలు