జాతీయ సమైక్యత వజ్రోత్సవ జెండా ఆవిష్కరణ

మహాదేవపూర్. సెప్టెంబర్ 17 (జనంసాక్షి)

జాతీయ సమైక్యత వజ్రోత్సవం సందర్భంగా మహాదేవపూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ పిప్పిరి శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు,మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రాణిబాయి,పి ఏ సి ఎస్ కార్యాలయంలో చైర్మన్ చల్ల తిరుపతి రెడ్డి అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో జాతీయ సమైక్యత వజ్రోత్సవ సంబరాలలో భాగంగా సెప్టెంబర్ 17 న జాతీయ సమైక్యత దినం పురస్కరించుకుని జాతీయ జెండా ను సర్పంచ్ శ్రీపతిబాపు ఆవిష్కరించారు.స్వదేశీ సంస్థానాల ఏకీకరణ చేసి,భారత యూనియన్ లో చేర్చిన ఘనత సర్ధార్ వల్లభాయ్ పటేల్ కు దక్కుతుందని సర్పంచ్ శ్రీపతిబాపు అన్నారు.ఈ కార్యక్రమంలో ఏ ఎస్ ఐ చేరాలు పోలీస్ సిబ్బంది, ప్రభుత్వ శాఖల అధికారులు, సింగిల్ విండో డైరెక్టర్లు, పంచాయతీ పాలక వర్గ సభ్యులు,గ్రామ కార్యదర్శి రజినీకాంత్ రెడ్డి, నాయకులు,గ్రామ పెద్దలు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.