జాతీయ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తెలియజేయాలి

అలంపూర్ వలయాధికారి సూర్య నాయక్

ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 13 : సమైక్యత భావాన్ని పెంపొందిస్తూ జాతీయ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తెలియజేయాలని అలంపూర్ వలయాధికారి సూర్య నాయక్ అన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆలంపూర్ సీఐ సూర్యనాయక్ ఆధ్వర్యంలో హర్ తిరంగ్ యాత్ర ప్రచారంలో భాగంగా శనివారం మండలం కేంద్రం నుండి 44వ జాతీయ రహదారి, ఎర్రవల్లి చౌరస్తా వరకు కార్లు, బైకులు, ఇటిక్యాల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులచేత జాతీయ పతకాలతో భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ
జాతీయ సమైక్యతకు ఫ్రీడం ర్యాలీ ప్రత్యేక ఆకర్షణీయమని అన్నారు. త్రివర్ణ పతాక ప్రదర్శనలతో మువ్వన్నెల జెండా రెపరెపలాడిందన్నారు. అలాగే దేశభక్తి నినాదాలు వీధులు మొత్తం మారుమోగాయి ఆయన అన్నారు. అలాగే వజ్రోత్సవాలలో భాగంగా ఎర్రవల్లి చౌరస్తాలోని ఏకశీలా ఇంటర్నేషనల్ స్కూల్, మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ఆధ్వర్యంలో తాసిల్దార్ సుబ్రహ్మణ్యం, ప్రజా పరిషత్ కార్యాలయం ఆధ్వర్యంలో ఎంపీడీవో రాఘవ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బుడ్డారెడ్డిపల్లె గ్రామంలోని అసిస్టెంట్ వ్యవసాయ అధికారి భరతసింహా ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లకు జాతీయ పథకాలు అమర్చి ప్రత్యేక ప్రదర్శనతో ఫ్రీడమ్ ర్యాలీలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఫ్రీడమ్ ర్యాలీలో అధికారులతో పాటు అన్ని వర్గాల ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు, యువకులు త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ ఉప్పొంగిన ఉత్సాహంతో పాల్గొన్నడం జరిగిందన్నారు. జాతీయతా భావాన్ని చాటుతూ ర్యాలీలో భాగస్వాములై వజ్రోత్సవ సంబరాలకు వన్నెలద్దారన్నారు. బ్రిటీష్ వలస పాలకుల చేతిలో బందీ అయిన భారతదేశానికి స్వేచ్చా స్వాతంత్ర్యాలు కల్పించేందుకు అనేక మంది సమరయోధులు ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేస్తూ, వారందరికీ నివాళులు అర్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఇటిక్యాల ఎస్సై గోకారి, కోదండపురం ఎస్సై వెంకటస్వామి, ఎర్రవల్లి సర్పంచ్ జోగుల రవి మరియు ఏకశీల ఇంటర్నేషనల్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.