జిందాల్, మధుకోడాకు కోర్టు నోటీసులు

న్యూఢిల్లీ:బొగ్గు కుంభకోణం కేసు విచారణకు హాజరుకావాలని ప్రత్యేకకోర్టు పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా, బొగ్గు శాఖ మాజీ మంత్రి దాసరి నారాయణరావు, ఆ శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తా సహా 15మందికి ప్రత్యేక సీబీఐ కోర్టు బుధవారం నోటీసులు జారీచేసింది. ఇందులో ఐదు సంస్థలు కూడా ఉన్నాయి. ఈ నెల 22న అమర్‌కొండ ముర్గదంగల్ బొగ్గుక్షేత్రాల కేటాయింపులపై విచారణ జరుగనున్నది.. ఆ సమయంలో కోర్టుకు హాజరుకావాలని సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి భరత్ పరాశర్ ఉత్తర్వులు జారీ చేశారు.