జిఎస్టి పై తెరాస నాయకుల నిరసన

ఏర్గట్ల జులై 21 (జనంసాక్షి) : నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం పప్పు, ఉప్పు, వంటి ఎన్నో నిత్యవసర వస్తువులను  జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావడం పై టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఏర్గట్ల మండల కేంద్రంలో గురువారం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నల్ల జెండాలతో నిత్యవసరాలపై జిఎస్టిని తొలగించాలని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ కొలిప్యాక ఉపేందర్, జెడ్పిటిసి గుల్లె రాజేశ్వర్ మాట్లాడుతూ నిత్యవసర వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తేవడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు తీవ్ర ఆర్థిక భారం పడుతుందని అన్నారు. వాటిని జీఎస్టీ పరిధిలో నుంచి వెంటనే తొగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మధు, తెరాస మండల అధ్యక్షులు రాజా పూర్ణానందం, ఏర్గట్ల గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షులు తుపాకుల శ్రీనివాస్ గౌడ్, రాంపూర్ పిఏసిఎస్ అధ్యక్షులు పెద్ద కాపుల శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు  రాజారాం సహదేవ్, లక్కం నర్సయ్య, బద్దం ప్రభాకర్, బద్దం శ్రీనివాస్, బర్మ నరేష్, జైనొద్దీన్, సోమిరెడ్డి శ్రీనివాస్, ఆశిరెడ్డి శ్రీనివాస్, నాగిరెడ్డి రాజేందర్, పలు గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచ్లు, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.