జిలుగు వెలుగుల పండుగ దీపావళి ఆనందంగా జరుపుకోవాలి.. జిల్లా కలెక్టర్ గోపి
వరంగల్ బ్యూరో: అక్టోబర్ 23(జనం సాక్షి)
సంస్కృతికి ప్రతిబింబంగా జరుపుకునేది పండుగలని, వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల,మత ,వర్గ విభేదాలను విస్మరించి, సమైక్యంగా జరుపుకునే పండుగ దివ్య దీపాల దీపావళి అని, ఈ పండుగను ప్రజలందరూ ఆనందంగా జరుపుకోవాలని, దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిలుగు, వెలుగుల, రంగుల ,దీపావళి చిన్న పెద్ద తేడా లేకుండా ఆనందంగా జరుపుకోవాలని, కలెక్టర్ గోపి కోరారు. దీపావళి పండుగకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందని, నరకాసురుడు అనే రాక్షసుడిని సంవరించిన మరుసటి రోజు అతని పీడ వదిలిన ఆనందంతో ప్రజలు దీపావళి పండుగ చేసుకుంటారని, అలాగే లంకలో రావణుని సంహరించిన శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజల ఆనందోత్సవాల మధ్య దీపావళి చేసుకున్నారని, చీకటిని పారదోలుతూ వెలుగులోని తెచ్చే పండుగగా విజయానికి ప్రతీకగా ప్రజలు దీపావళి పండుగను చేసుకుంటారని ఆయన అన్నారు. ఉద్యోగులకు వారి కుటుంబాలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని, ముఖ్యంగా పిల్లలు టపాసులు, బాణాసంచలు ,ఇతర మందు గుండు సామాగ్రి విషయంలో జాగ్రత్తలు పాటించేలా తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఆయన తెలుపుతూ మరి ఒకసారి అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
Attachments area
ReplyForward
|